జూన్ 3న ఎమ్మెల్యేగా ఉత్తమ్ రాజీనామా .. కీలకంగా మారనున్న హుజూర్ నగర్ ఎన్నిక
Recommended Video
అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్‌నగర్ నుండి పోటీ చేసి విజయాన్ని సాధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ పదవికి ఈ జూన్ 3 వ తేదీన రాజీనామా చేయనున్నారు. ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుండి పోటీ చేసిన ఉత్తమ్.. ఎంపి గానూ గెలుపొందారు. ఈ నేపథ్యంలో.. ఎంపి గా కొనసాగాలని నిర్ణయించిన ఉత్తమ్.. ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయనున్నారు. ఉత్తమ్ రాజీనామా చేస్తే త్వరలోనే హుజుర్ నగర్ లో ఉప ఎన్నిక నిర్వహిస్తారు.
ఉత్తమ్ కుమార్ నల్లగొండ నుండి ఎంపీగా గెలవడంతో, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ హుజుర్ నగర్ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది . అయితే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సాధారణం కాదు. అయితే ఆ స్థానంలో ఉత్తమ్ కుమార్ భార్య కి టికెట్ వచ్చే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు . ఇక ఆ స్థానం నుండి టీఆర్ ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారు అన్న దానిపై క్లారిటీ లేదు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తారని కొందరు భావిస్తున్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో కేవలం మూడు వేల ఓట్లతో ఓటమి పాలైన సైదిరెడ్డి కి అవకాశం ఇస్తారని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఉప ఎన్నికలో అక్కడ కాంగ్రెస్ చాలా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి హేమాహేమీలు ఓటమి పాలైనా హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఆ స్థానాన్ని కాపాడుకునే బాధ్యత ఉత్తమ్ పైన ఉంది . హుజూర్ నగర్ ఎన్నిక ఇరు పార్టీలకు కీలకంగా మారనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications