యాదాద్రిలో జలపాతం..? చూసి ఆశ్చర్యపోతున్న భక్తులు

యాదాద్రి పుణ్యక్షేత్రం సుందరంగా ముస్తాబవుతోంది. దేవాలయం చుట్టూ ప్రకృతి వానలు, పూల మొక్కలను నాటుతున్నారు. పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా ఆలయం చుట్టూ ముస్తాబు చేస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలోని కొండపై కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు. ఇది ప్రకృతి సిద్దంగా ఏర్పడిన జలపాతం లాగానే కనిపిస్తుంది. అసలే సీజన్ కావడంతో.. నిజంగా జలపాతమా అనే సందేహాం కలుగుతోంది.

మొదటి ఘాట్‌ రోడ్డు వెంట ఉన్న రాతి గుట్టలపై జలపాతాన్ని ఏర్పాటు చేశారు. గుట్టపై నుంచి జాలువారుతున్న దృశ్యం భక్తులకు ఆహ్లాదాం ఇస్తుందని వైటీడీఏ అధికారులు తెలిపారు. మరోవైపు ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఇప్పటికే యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. రియల్ వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది. భువనగిరి -యాదాద్రి రోడ్డుకు ఇరువైపుల పూలమొక్కలు నాటారు. ఇవి చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

waterfall ay yadadri lakshmi narasimha swamy temple

యాదగిరిగుట్టను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేస్తోన్న సంగతి తెలిసిందే. అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి.. ఆలయ రూపు రేఖలనే మార్చివేశారు. అలాగే యాదగిరిగుట్ట.. కాస్త యాదాద్రిగా మార్చారు. అక్కడ మాఢ వీధులను కూడా ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు డెవలప్ కావడంతో.. అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. భారీగా వెంచర్లు వేసి.. ప్లాట్లను విక్రయిస్తున్నారు. ధర వస్తుందనే ఆశతో చాలా మంది కొనుగోలు కూడా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యాదాద్రిని మరో తిరుమల మాదిరిగా అభివృద్ది చేస్తోంది.

యాదాద్రిలో ఏర్పాటు చేసిన జలపాతం మాత్రం కనువిందు చేస్తోంది. చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం వద్ద ఇప్పటివరకు లేని వాటర్ పాల్ ఇప్పుడు ఎక్కడిదని సందేహాపడుతున్నారు. కానీ అదీ కృత్రిమంగా ఏర్పాటు చేసిందని తెలిసి.. ఆశ్చర్యపోతున్నారు. అవునా నిజంగా.. ఏర్పాటు చేసిందేనా అని నోరెళ్లబెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+