Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‍షిప్‍లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. తొలి భారతీయుడిగా రికార్డు..

ఒలింపిక్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి తన సత్తా చాటాడు. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ లో స్వర్ణ పతకం సాధించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ లో నీరజ్ చోప్రా 88.17 మీటర్లు జావెలిన్ విసిరి స్వర్ణం గెలిచాడు. దాయాది దేశం పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ రజిత పతకంతో సరిపెట్టుకున్నాడు. చెక్ రిపబ్లిక్ చెందిన వద్లెచ్ కాంస్య పతకం వచ్చింది.

నీరజ్ చోప్రా ఫైనల్లో తొలి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఫౌల్ చేశాడు. కానీ రెండో ప్రయత్నంలో జావెలిన్ ను 88.17 మీటర్లు విసిరి సత్తా చాడు. మూడో ప్రయత్నంలో 86.32 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. నాలుగో ప్రయత్నంలో 84.64 మీటర్లు.. ఐదో ప్రయత్నంలో 87.73 మీటర్లు, ఆరో ప్రయత్నంలో బల్లెంను 83.98 మీటర్లే విసిరాడు. అయితే రెండో ప్రయత్నంలో నీరజ్ విసిరిన దాని కంటే ఎవరు ఎక్కువగా విసరలేకపోయారు. దీంతో నీరజ్ ఛాంపియన్ గా నిలిచాడు. స్వర్ణం సాధించాడు.

Neeraj Chopra won the gold medal at the World Athletics Championships

ఇదే ఫైనల్లో భారత త్రోయర్లలో కిశోర్‌ జెనా 84.77 మీటర్లు జావెలిన్ విసిరి అయిదో స్థానంలో నిలవగా, మను 84.14 మీటర్లు బల్లెం విసిరి ఆరో స్థానం దక్కించకున్నాడు.
గతంలో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ రెండు పతాకాలు మాత్రమే సాధించింది. 2005లో అంజు బాబి జార్జ్ మహిళల లాంగ్ జంప్ లో కాంస్యం పతకం సాధించింది. 2022 ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు.

జావెలిన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత నంబర్ 1 స్థానంలో చోప్రా ఉన్నాడు. టోక్యో 2020లో ఒలింపిక్ స్వర్ణాన్ని గెలుచుకున్న చోప్రా గత సంవత్సరం యూజీన్‌లో జరిగిన వరల్డ్స్‌లో అండర్సన్ పీటర్స్ స్వర్ణాన్ని కైవసం చేసుకోవడంతో రజతంతో ముగించాడు. భారతదేశపు సూపర్ స్టార్ జావెలిన్ త్రోయర్ చోప్రా చెక్ రిపబ్లిక్‌కు చెందిన దిగ్గజ జాన్ జెలెజ్నీ, నార్వేకు చెందిన ఆండ్రియాస్ థోర్కిల్డ్‌సెన్ తర్వాత, ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల టైటిల్‌లను ఏకకాలంలో సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు.

జెలెజ్నీ 1992, 1996, 200లో ఒలింపిక్స్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంటూ 1993, 1995, 2001లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. థోర్కిల్డ్‌సెన్ 2008 ఒలింపిక్స్, 2009 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణం సాధించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+