నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెల్లూరు పాలిటిక్స్: కాకాణికి ఘన స్వాగతం.. పూల వర్షం కురిపించిన కార్యకర్తలు

|
Google Oneindia TeluguNews

నెల్లూరులో వైసీపీలో పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. ఆదివారం రోజు మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్.. తమ బల నిరూపణ చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ సభ నిర్వహించారు. అందులో హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఇక మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బైక్ ర్యాలీ చేశారు. దీంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇద్దరు నేతల కార్యక్రమం కోసం వెయ్యి మందికి పైగా పోలీసులను కేటాయించారు.

నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌లో అనిల్ సభ జరిగింది. సభ బానే జరిగినా.. అనిల్ మాత్రం కామెంట్స్ చేశారు. తర్వాత కాకాణి తొలిసారిగా నెల్లూరు వచ్చారు. కావలి నుంచి ఆయన ర్యాలీ నెల్లూరుకు చేరుకోగానే పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆర్యవైశ్య నేతలు, వైసీపీ శ్రేణులు కాకాణికి స్వాగతం పలికారు. ఆత్మకూరు బస్టాండు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నెల్లూరు వైసీపీ కార్యాలయానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు.

 followers hearty welcome to minister kakani govardhan reddy

అంతకుముందు, అమరావతి నుంచి కావలి విచ్చేసిన ఆయనకు పట్టణ శివార్లలో స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కార్యకర్తలు స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ కావలి పట్టణంలోకి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అనంతరం నెల్లూరు పయనం అయ్యారు. ఇవాళే ఇద్దరు నేతలు పర్యటన ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎక్కడ ప్రసంగం చేయలేదు. అనిల్ మాత్రం జగన్ ఫోటోతోనే అంతా గెలవాలని.. తాను మళ్లీ మంత్రిని అవుతానని అగ్గిరాజేశారు.

అనిల్ కామెంట్లను హై కమాండ్ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇద్దరు నేతలు సంయమనంగా ఉండాలని చెప్పిన సంగతి తెలిసిందే. అయినా అనిల్.. మాట్లాడటంపై కొంత అసహనంతో సీఎం జగన్ ఉండి ఉంటారు. అనిల్‌ను పిలిపించి మాట్లాడే అవకాశం ఉంటుంది.

English summary
followers hearty welcome to minister kakani govardhan reddy at home town nellore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X