Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పోవాలి..బాబు రావాలి: అప్పటిదాకా అరగుండు, అరమీసంతోనే తిరుగుతా: నెల్లూరు టీడీపీ నేత

నెల్లూరు: నెల్లూరు మున్సిపల కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించింది. క్లీన్ స్వీప్ చేసింది. అన్ని డివిజన్లనూ గెలుచుకుంది. ఈ కార్పొరేషన్ పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఒక్క డివిజన్‌ను కూడా గెలవలేకపోయింది. ఎన్నికలు నిర్వహించిన 46 డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏకగ్రీవాలను కూడా కలుపుకొంటే మొత్తం 54 డివిజన్లను అధికార పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు.

ఈ పరిణామాలు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురి చేశాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిదిలోని 49, 50 డివిజన్లకు టీడీపీ తరఫున ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన కప్పిర శ్రీనివాస్‌ భీష్మ ప్రతిజ్ఞకు పూనుకున్నారు. తాను ఇన్‌ఛార్జిగా ఉన్న డివిజన్లలో టీడీపీ గెలవకపోతే.. అరగుండు, అరమీసంతో తిరుగుతానంటూ ఆయన ఇదివరకు ఎన్నికల ప్రచారంలో ప్రతిజ్ఞ చేశారు. దాన్ని నిలబెట్టుకున్నారు. ఫలితాలు పూర్తిగా వెలువడిన రోజే అరగుండు, అరమీసం గీయించుకున్నారు.

 Nellore TDP man who challenged to tonsure half head if he loses the election had done the same,video goes viral

జగన్ పోవాలి.. బాబు రావాలి అని రాసిన పలకను మెడలో వేసుకుని ఆయన అరగుండు, అరమీసం గీయించుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో 49, 50 డివిజన్లకు తాను ఇన్‌ఛార్జిగా పని చేశానని, ఈ రెండు చోట్ల తమ పార్టీ అభ్యర్థులు గెలవకపోతే అరగుండుతో తిరుగుతానని మాట ఇచ్చానని, దానికి కట్టుబడి ఉన్నానని శ్రీనివాస్ అన్నారు. 49, 50 డివిజన్లలో గెలవడానికి వైసీపీ నాయకులు మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేశారని ఆరోపించారు.

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు తాను అరగుండు, అరమీసంతోనే తిరుగానని అన్నారు. జగన్ పోవాలి, బాబు రావాలంటూ నినాదం చేశారు. శ్రీనివాస్ అరగుండు, అరమీసం గీయించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+