నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్లక్ష్యం ఖరీదు: 70 మంది విద్యార్థులకు అస్వస్థత

|
Google Oneindia TeluguNews

మధ్యాహ్న భోజనం మరోసారి వికటించింది. భోజనాలు వండటంలో అపరిశుభ్రత, నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలమీదకు తెస్తోంది. ఇటువంటి ఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఈ నిర్లక్ష్యానికి ఫుల్ స్టాప్ పడటంలేదు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ పరిధిలో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నా భోజనం వికటించి 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బీర్కూర్‌ ప్రభుత్వ స్కూల్‌లో మధ్యాహ్నా భోజనంలో ఉడికీ ఉడకని అన్నంతో పాటు కుళ్లిపోయిన కోడిగుడ్లు వడ్డించడంతో అవి తిన్న 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో ఇబ్బంది పడ్డారు.దీంతో విద్యార్ధుల పరిస్థితి విషమంగా మారటంతో వారిని బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలపటంతో తల్లిదండ్రులు హాయిగా ఊపిరి తీసుకున్నారు.

 food poison in nizamabad birkur government school

బాన్సువాడ మండలం ఇబ్రహీంపేటలో గత గురువారం మధ్యా హ్న భోజనం వికటించి 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా తిరక్కుండానే మళ్లీ మధ్యాహ్న భోజనం వికటించిన ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భోజనాలు వండటంలోను..నాణ్యమైన భోజనం పెట్టటంలో నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని..తమ పిల్లలకు ఏమైనా జరిగితే మేం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.

బీర్కూర్ పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు. బుధవారం 264 మంది స్కూల్ కు రాగా..రోజులాగే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం పెట్టగా భోజనం తిన్న విద్యార్ధులకు అన్నం, పప్పుతో పాటు గుడ్డు వడ్డించారు. అలా భోజనం తిన్న కొద్ది సేపటికి విద్యార్థులు కడుపు నొప్పితో విలవిల్లాడిపోతు..వాంతులు చేసుకున్నారు. అది గమనించిన ఉపాధ్యాయులు విద్యా శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆరోగ్య సిబ్బందికి విద్యార్ధుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్ లకు ఫోన్ చేసి వెంటనే విద్యార్ధుల్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందుగానే బాన్సువాడ ఆస్పత్రికి సమాచారం అందించడంతో విద్యార్థులకు సరిపడా పడకల్ని అందుబాటులో ఉంచారు.

Recommended Video

దోమల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడితేనే డెంగ్యూ జ్వరాన్ని తరిమికొట్టొచ్చన్న డాక్టర్ కరుణ

మధ్యాహ్న భోజనంలో వడ్డించిన గుడ్ల వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు గుర్తించారు. ఉడికించిన గుడ్డు కుళ్లిపోయిన వాసన వచ్చినట్లు ఆహార పదార్ధాలను పరిశీలించిన అధికారులు తెలిపారు. దీంతో వెంటనే అధికారులు వంటశాలను..సామగ్రిని పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.

English summary
food poison in nizamabad birkur government school. 70 students fell ill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X