నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ ఆత్మహత్య

నిజామాబాద్ రూరల్ తహసీల్ధార్ జ్వాల గిరిధర్ రావు ఆత్మహత్య చేసుకున్నారు. తహసీల్దార్ ఆత్మహత్య స్థానికంగా సంచలనం కలిగించింది. ఆర్యనగర్ లో అద్దెకు ఉంటున్న తహశీల్ధార్ జ్వాల గిరిధర్ రావు అకస్మాతుగా ఆత్మహత్యకు పాల్పడటం వెనుక కారణాలు ఏమిటో ఇంకా తెలీలేదు . నల్గొండ జిల్లా రామగిరికి చెందిన తహశీల్ధార్ జ్వాల గిరిధర్ రావు సంవత్సరం క్రితం నిజామాబాద్ రూరల్ తహశీల్ధార్ గా నియమితులయ్యారు.

ఆత్మహత్యకు గల కారణాలు అధికారులు బయటకు చెప్పడం లేదు. కానీ తహసీల్దార్ ఆత్మహత్య కు కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా ? లేకా అనారోగ్య సమస్యలా ?లేకా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Nizamabad rural tahasildar suicide

హైదరాబాద్‌కు చెందిన గిరిధర్ రావు గత ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. ఎన్నికల తర్వాత కూడా బదిలీ కాలేదు. కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఇక ఆయన ఒక్కరే ఆర్య నగర్ లో అద్దెకు ఉంటున్నారు .

ఈ రోజు ఆయన ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటన స్థలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు , ఆర్డీఓ, ఏసీపీ లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+