Gold Rate: పసిడి ప్రియులకు శ్రావణ శుక్రవారం షాక్.. నేడు రూ.8200 పెరిగిన గోల్డ్ రేటు
Gold Price Today: గడచిన రెండు రోజులుగా స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు శ్రావణ శుక్రవారం రోజున తిరిగి పుంజుకున్నాయి. వాస్తవానికి శుభకార్యాలు ప్రారంభమైన వేళ తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలనుకుంటున్న మహిళలు నేడు భారీగా పెరిగిన ధరలు చూసి షాక్ అవుతున్నారు. త్వరలోనే రాఖీ పౌర్ణమి, దీపావళి వంటి పండుగలు దగ్గర పడుతున్న వేళ షాపింగ్ చేసేందుకు వారు షాపులకు క్యూ కడుతున్న సమయంలో ధరలు తిరిగి పెరుగుతున్నాయని వాపోతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7500 పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6425, ముంబైలో రూ.6425, దిల్లీలో రూ.6440, కలకత్తాలో రూ.6425, బెంగళూరులో రూ.6425, కేరళలో రూ.6425, వడోదరలో రూ.6340, జైపూరులో రూ.6440, మంగళూరులో రూ.6425, నాశిక్‌లో రూ.6428, అయోధ్యలో రూ.6440, బళ్లారిలో రూ.6425, గురుగ్రాములో రూ.6440, నోయిడాలో రూ.6440 వద్ద నేడు విక్రయాలు జరుగుతున్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.8200 పెరిగింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7009, ముంబైలో రూ.7009, దిల్లీలో రూ.7024, కలకత్తాలో రూ.7009, బెంగళూరులో రూ.7009, కేరళలో రూ.7009, వడోదరలో రూ.7014, జైపూరులో రూ.7024, మంగళూరులో రూ.7009, నాశిక్‌లో రూ.7014, అయోధ్యలో రూ.7024, బళ్లారిలో రూ.7009, గురుగ్రాములో రూ.7024, నోయిడాలో రూ.7024గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6425 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7009 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1500 పెరిగి రూ.88,000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications