పవన్ కొత్త నినాదం -కాపులు పెద్దన్న పాత్ర వహించాలి : రాజ్యాధికారం సాధించాలి- టీడీపీ సత్తా సరిపోకనే..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలన సమీకరణాలకు తెర లేపారు. వైసీపీ నేతలు యుద్దానికి సిద్దం కండి. మీరు నన్ను మానసికంగా అత్యాచారం చేసారు. రెచ్చగొట్టారు. ఏ యుద్దం కావాలో మీరే కోరుకోండి. ఇక తగ్గేది లేదని పవన్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఈ రాజకీయ శక్తులను తట్టుకోవటం టీడీపీకి సాధ్య పడటం లేదు. వారి సత్తా సరిపోవటం లేదు. అందుకే జనసేన రోడ్డు మీదకు వచ్చిందంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇదే సమయంలో కాపు ..బలిజ..ఒంటరి..తెలగ కులాలు ఐక్యంగా పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. బీసీలతో కలిసి..ఎస్సీలను కలుపుకుంటూ రాజ్యాధికారం సాధించాలంటూ..పవన్ రాజీకయంగా కొత్త సమీరణాలకు నాంది పలుకుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

కాపులు ఐక్యం కావాలి-బీసీలతో కలిసి రాజ్యాధికారం

కాపులు ఐక్యం కావాలి-బీసీలతో కలిసి రాజ్యాధికారం

వైసీపీని ఓడిస్తానని సవాల్ చేసిన పవన్ కళ్యాణ్ ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపారు. కాపులకు అధికారం రాకూడదు. అందుకే తొక్కేయాలనే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నారంటూ మండి పడ్డారు. 2009 లో ఈ ప్రయత్నం జరిగినా సాధ్యపడలేదన్నారు. ఇప్పుడు కాపులు- తెలగ -బలిజ- ఒంటరి కులాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరి చేతుల్లో పడ్డాం... ఎవరి చేతుల్లో నలిగిపోయామనేది ఆలోచన చేయాలని సూచించారు. మీరంతాముందుకు వస్తే తప్ప తూర్పు కాపులు..శెట్టి బిలిజలు - తూర్పు కాపులు కలిసి రారాని..వారు కలిసి రావాలంటే మీరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏడు దశాబ్డాలుగా పోరాడుతున్నారు. అవసరమైతే తగ్గి ఉండండి. కలిసి ఐక్యంగా ఉండండి. ఈ పోరాటం దేశం మొత్తం మార్పు తీసుకొస్తుంది. ఏపీలో కొత్త శక్తులు అధికారంలోకి రావాలి. అది ఈ మార్పు గోదావరి జిల్లాలతో ముడి పడి ఉందంటూ పవన్ వచ్చే ఎన్నికల్లో తన నినాదం ఏంటో స్పష్టం చేసారు.

అన్ని కులాలకు మాట ఇస్తున్నా

అన్ని కులాలకు మాట ఇస్తున్నా

కాపులు-బలిజ-ఒంటరి-తెలగ వర్గాలు కలిస్తేనే బలమని..పెద్దన్న పాత్ర వహిస్తేనే మార్పు సాధ్యమని పవన్ తేల్చి చెప్పారు. అదే సమయంలో తాను అన్ని కులాలకు మాట ఇస్తున్నానంటూ..తన చివరి శ్వాస వరకు రాజకీయాలను వదలనని స్పష్టం చేసారు. గోదావరి జిల్లాల వాసులకు కోపం అనేది పొంగు లాగ వచ్చి పోతుందని..వీళ్లకు రాయలసీమ లో శిక్షణ అవసరమని చెప్పారు. అక్కడ మూడు తరాలు కోపం ఉంచుకుంటారంటూ వివరించారు. వైసీపీ పాలనతో కమ్మ వర్గం పై కోపంతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేసారని వ్యాఖ్యానించారదు. రెడ్డి వర్గంలోనూ వారి దగ్గర ఉన్న వారు మినహా.. జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి లాంటి వారు బాధలు పడుతున్నారంటూ పవన్ చెప్పుకొచ్చారు

తిట్టిన వారిని దిలేదు.. వారిని నార తీస్తా...

తిట్టిన వారిని దిలేదు.. వారిని నార తీస్తా...

సజ్జల మీరు పెద్దలు. మీకు నా గురించి బాగా తెలుసు. మీరు యాక్షన్ -కెమేరా -కట్ అని అన్నారు. మీలాంటి వాళ్లు ఉండి కూడా కనీసం 26 కీలీ మీటర్లు కూడా గుంతలు లేకుండా చేయగలరా. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లు లేరు. డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేస్తున్నారు. రాజకీయ లబ్ది కోసం ఈ కార్యక్రమం నిర్వహించలేదు. నేను వెళ్లి సలా చేస్తే ఏ పార్టీ అయినా గుండెళ్లో పెట్టుకొని చూసుకుంటుంది. నన్ను బూతులు తిట్టే వాటిని నార వలిచి చూపిస్తాను. నా మీద మానసిక అత్యాచారాలు ఎన్నో.. తొక్క తీసి నార తీస్తా. నా సహనాన్ని చేతగాని తనం అనుకోవద్దు. తొక్కి నార తీస్తాను ఒక్కొక్కడికి అంటూ వార్నింగ్ ఇచ్చారు.

అరుస్తారు..గెలిపించరు...పవర్ స్టార్ అనద్దు

అరుస్తారు..గెలిపించరు...పవర్ స్టార్ అనద్దు

పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న వారిని వారించారు. పవర్ స్టార్ అని స్లోగన్స్ ఇవ్వదన్నారు. పవర్ స్టార్ అంటారు... ఓట్లు వేయరు అంటూ చురకలు వేసారు. గెలిపించని మీరు ఇలాంటి నినాదాలు వద్దని.. వాస్తవాలు మాట్లాడుకుందామని చెప్పారు. మీరు వైసీపీకి ఓట్లు వేసారు..మీకు ఉద్యోగాలు వచ్చాయా అని ప్రశ్నించారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి తనను దూషించిన అంశాన్ని ప్రస్తావించారు. ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. ఏం పొడిచావని అంత అహంకారమని పవన్ నిలదీసారు. అదంతా మెతక నేతలు ఉన్న ససమయంలో అని చెప్పుకొచ్చారు. తాను పుట్టిన కులాన్ని గౌరవిస్తానని వ్యాఖ్యానించారు. నా కులాన్ని కించ పరిచేందుకే అలా మాట్లాడుతున్నారంటూ తన తండ్రి మిత్రుడు చెప్పారని వివరించారు. అడ్డగోలుగా సంపాదించి...వాగుతున్నారు.

పేర్ని నాని - రెడ్డి సామాజిక వర్గం గురించి పవన్ వ్యాఖ్యలు

పేర్ని నాని - రెడ్డి సామాజిక వర్గం గురించి పవన్ వ్యాఖ్యలు

నేను పుట్టిన కులంలో నుంచే వచ్చిన మంత్రి..కులం పేరు చెప్పి నన్ను తిట్టాడంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరే తిడితే..చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు ఎందుకు తిట్టరని ప్రశ్నించారు. మీకు - నాకు పాలసీ సమస్యల మీదే మాట్లాడుదాం. బూతులు తిడితే ప్రయోజనం లేదు. వైసీపీ కమ్మ వర్గాన్ని రాష్ట్రాన్ని అతలా కుతలం చేసారు. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు-వర్గాల వారికి రాజకీయ సాధికారిత రావాలని కోరుకుంటున్నానని వివరించారు. సుప్రీం చీఫ్ జస్టిస్..ఉప రాష్ట్రపతి-మాజీ ముఖ్యమంత్రి మొదలు ప్రతీ ఒక్కరి పైన దాడులు చేస్తున్నారని...ఇది సహించేది కాదని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. అన్నింటికీ తెగించే వచ్చానని..ఎంత అంటే అంత అంటూ తేల్చి చెప్పారు. రెడ్డి సామాజిక వర్గంలోనూ ప్రభుత్వంపైన బాధ ఉందన్నారు. ఐఏఎస్..ఐపీఎస్ లు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి సెట్యూల్ చేస్తే ఇబ్బంది కరంగా ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+