ఎంపీ గన్‌మెన్, ఫొటోగ్రాఫర్ కు కరోనా .. క్వారంటైన్ లో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక్కడ అక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ అన్ని ప్రాంతాలలోనూ కరోనా విస్తరిస్తోంది. ఇక ప్రజాప్రతినిధులకు చుక్కలు చూపిస్తుంది . తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వద్ద పనిచేస్తున్న గన్ మెన్ కు, ఫోటోగ్రాఫర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఎంపీ తో పాటు,ఎంపీని కలవడానికి వచ్చిన వారికి టెన్షన్ పట్టుకుంది .
మొన్నటికి మొన్న ఏపీ హైకోర్టు లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదు కదా,ఇక తాజాగా ఏపీ సచివాలయం, అసెంబ్లీ ప్రాంగణాల్లో మరో 12 మందికి కరోనా పాజిటివ్ నమోదయింది. ఇదే సమయంలో ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు . చాలా మంది ప్రజాప్రతినిధులు వద్ద పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదుకావడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ వద్ద పనిచేస్తున్న గన్ మెన్ కు, ఫోటోగ్రాఫర్ కు కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఎంపీ మార్గాని భరత్ రామ్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు.

రిపోర్టులలో ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. భరత్ రామ్ ఎక్కడికైనా వెళ్లాల్సి ఉన్నా ఎవరు లేకుండా సింగిల్ గా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కేసులతో అటు సామాన్య ప్రజలే కాకుండా, ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పక తప్పని పరిస్థితి. దేశంలోనే అత్యధికంగా టెస్ట్ లు చేసినా,కరోనా కట్టడి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా కరోనా నియంత్రణ మాత్రం సాధ్యం కావడం లేదు. ఒక్క ఏపీలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ పరిస్థితి అదే విధంగా ఉంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications