పది పాస్, అంతలోనే విషాదం : టాటా ఏస్ ఢీకొని విద్యార్థిని మృతి

ఏలూరు : పదో తరగతి పాసయ్యాననే ఆనందం ఆ విద్యార్థికి అంతలోనే విషాదంగా మారింది. మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యానని కూల్ డ్రింక్ తీసుకొద్దామని బయటకు వెళ్లడమే పాపమైంది. టాటా ఏస్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది.

అంతలోనే విషాదం
పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కల్వచర్లకు చెందిన రుక్మిణి పదో తరగతి పూర్తిచేసింది. పది ఫలితాలు చూసుకొని .. పాసయ్యాననే ఆనందపడింది. స్నేహితులు, బంధువుల కోసం కూల్ డ్రింక్ తీసుకొస్తానని బయటకు వచ్చింది. కల్వచర్లలోని తన ఇంటి నుంచి బయటకొచ్చిన యువతిని టాటా ఏఎస్ వాహనం ఢీ కొంది. సాఫ్ట్ డ్రింక్ కోసం వెళ్లిన కూతురు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి కంటతడి అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది. ఇంతలోనే ఎంత విషాదం అని ప్రతి ఒక్కరు బాధపడ్డారు.

student dead in road accident

చర్యలు తీసకొండి
విద్యార్థిని తల్లిదండ్రులు టాటా ఏస్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అతడి నిర్లక్ష్యం మా ఇంటి దీపాన్ని ఆర్పివేసిందని పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టాటా ఏస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. నిర్లక్ష్య డ్రైవింగ్, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు విద్యార్థిని ఆకాల మరణంపై తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాసేపటి క్రితం కూడా తమతో ఉన్న రుక్మిణి ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో రోదిస్తున్నారు. ఆమె జాపకాలను తాము మరవమని గుర్తుచేసుకుంటున్నారు. వారే కాదు చుట్టుపక్కల వారు, బంధువులు కూడా రుక్మిణి గురిచి తలచుకొని కంటతడి పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+