YSRCP అశ్లీల భాషా పాఠశాల .. ప్రిన్సిపాల్ రోజా, హెచ్ఓడి గా కొడాలి నాని : గోరంట్ల సెటైర్లు
వైఎస్ఆర్సీపీ
తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు .సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అవుతున్నాయి . వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లాడుతున్న భాషపై ఆయన మండిపడ్డారు . వైసీపీ మంత్రులకు, సభ్యులకు మాట్లాడే పద్ధతి రాదని, వారు చాలా అభ్యంతరకరమైన భాష మాట్లాడతారని పేర్కొన్న ఆయన తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు .

వైయస్ఆర్సిపి అశ్లీల భాషా పాఠశాల అంటూ సోషల్ మీడియాలో గోరంట్ల పోస్ట్
ఇక ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ లో అశ్లీల భాష యొక్క పాఠశాల షార్ట్ టర్మ్ కోర్టు అందుబాటులో కలదు అని చెప్తూ అది ప్రతిపక్ష పార్టీని తిట్టడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాత్రమే అని అలాంటి వారే పరీక్షలో పాస్ అవుతారని చెప్పుకొచ్చారు. ఇక ఈ కోర్సు షార్ట్ టర్మ్ కోర్సు అని తాడేపల్లిలో కోర్సు చెప్తారని పేర్కొన్నారు. ఇది ఆన్లైన్ లో కూడా నేర్పిస్తారని పేర్కొన్నారు
దానికి ప్రిన్సిపాల్ రోజా అని పేర్కొన్నారు.

వైసీపీ నాయకుల డిగ్రీలను బట్టి వారి పోస్ట్ లు.. రోజా ప్రిన్సిపాల్
ఎందుకంటె ఆమెకు తిట్లు నందు ప్రావీణ్యం కలదు అని, చాలా సంవత్సరాల అపార అనుభవం ఉంది కాబట్టే ఆమెకు ప్రిన్సిపాల్ పోస్ట్ ను ఇచ్చారన్నారు . అలానే ఈ పాఠశాలకు హెచ్ఓడి గా కొడాలి నాని ఉన్నట్టు చెప్పారు. ఆయన నీ అమ్మమొగుడు అనే సర్టిఫికెట్ కోర్సు హోల్డర్ కాబట్టి ఆయనకు హెచ్ఓడీ గా అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇక ప్రొఫెసర్ గా అనిల్ యాదవ్ కు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఎందుకంటె ఆయన బుల్లెట్లు దింపడం లో అనుభవశీలి అని పేర్కొన్నారు.

బొత్సా బహుభాషా కోవిదుడు అని సెటైర్లు
ఇక డాన్స్ మాస్టర్ గా అంబటి రాంబాబుకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు .నాట్యం చేయడం లో దిట్ట మరియు అనేక మంది తో నాట్యం చేసిన అనుభవం ఆయనకు ఉందని సెటైర్ వేశారు. అంతేకాదు గెస్ట్ ఫ్యాకల్టీగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారని చెప్పిన గోరంట్ల బొత్సా బహుభాషా కోవిదుడు ఏ విషయం అయిన స్పష్టంగా మాట్లాడే అనుభవం ఈయన సొంతం అని ఎద్దేవా చేశారు. పీఈటిగా పృద్విరాజ్ ను ఎంపిక చేశారని పేర్కొన్న ఆయన ఏదైనా సరే వెనకనుండి ఆకర్షించడం ఈయన ప్రత్యేకత అని చెప్పారు .

అన్ని విభాగాల్లో నైపుణ్యం ఉన్న జగన్ డీన్ అంటూ వ్యంగ్యం
ఇక మాథ్స్ హెడ్ గా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఉన్నారని తప్పుడు లెక్కని కరెక్ట్ గా చెప్పడం లో ఈయన మేధస్సు అమోఘమైనదని చెప్పారు . డీన్ గా జగన్ ను పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్ని విభాగాల్లో నైపుణ్యం ఈయన సొంతం అంటూ చురకలు వేశారు . అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా విజయసాయి రెడ్డిని నియమించారని చెప్పిన గోరంట్ల పారదర్శకంగా లెక్కలు చూపడంలో ఈయన అనుభవజ్ఞులు అని పేర్కొన్నారు. గోరంట్ల పేస్ బుక్ లో పెట్టిన ఈ వ్యంగ్య ధోరణిలో ఉన్న పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications