అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి అరెస్ట్... చంచల్‌గూడ జైలుకు తరలింపు
గత రెండురోజులుగా అక్రమాస్తుల విషయంలో సోదాలు ఎదుర్కొంటున్న సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీలో కోర్టులో హజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
సిద్దిపేట లా అండ్ అర్డర్ విభాగంలో అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న నర్సింహారెడ్డి ఆస్తులపై గత రెండు రోజులుగా ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్, జహీరాబాద్, అయ్యవారిపల్లె, సిద్దిపేట, హైదరాబాద్‌లో నర్సింహారెడ్డి ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దీంతో మొత్తం పదికోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు కనుగొన్నారు.

నర్సింహారెడ్డి స్వంత నివాసంలో కిలోన్నర బంగారం, అయిదు లక్షల రూపాయల నగదు, మరో ఆరులక్షల రూపాయల బ్యాంకు బ్యాలన్స్, తోపాటు గోల్కండ కోట సమీపంలో ఓ విల్లా, మరోవైపు శంకర్‌పల్లి, గొల్లపల్లి, జహీరాబాద్ ఏరియాల్లో మరో 14 ఇంటి ప్లాట్లు, ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు మహబుబ్‌నగర్, సిద్దిపేట ప్రాంతాల్లో మరో ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి, ఉన్నట్టు గుర్తించారు. కాగా సోదాలు పూర్తయిన అనంతరం నేడు సాయంత్రం అరెస్ట్ చేసి, ఏసీబీ కోర్టులో హజరు పరిచారు. కాగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications