ఐసిస్ షాకింగ్!: హైదరాబాద్‌లో 10మందిని తనవైపు తిప్పుకున్న నజీబ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 'ఖలీఫా ఉల్ ఏ హింద్ సౌత్ ఇండియా' చీఫ్ నజీబ్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. విచారణలో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. ఎన్ఐఏ నజీబ్ నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
ఖలీఫా ఉల్ ఏ హింద్ ఇండియా చీఫ్ మున్వర్ అబ్బాస్ ఆదేశాలతో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు పేలుళ్లకు నజీబ్ కుట్ర పన్నాడు. భారత్‌లోని యువతకు సోషల్ నెట్ వర్క్ ద్వారా ఉగ్రవాద సంస్థలు వల వేస్తున్నాయి. ఈ పద్ధతిలో హైదరాబాద్‌లో దాదాపు 10 మందిని నజీబ్ తనవైపు తిప్పుకున్నాడు.
Also Read: (పిక్చర్స్) హైద్రాబాద్ నుంచే.. ఐసిస్ సానుభూతిపరులు: రఫిక్... యువతితో బెంగళూరుకు

దక్షిణ భారత దేశం అంతటా నజీబ్ తన నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడని తెలుస్తోంది. ఐసిస్ నేత షఫీ ఆదేశాలతో కూడా నజీబ్.. యువతను సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌ల ద్వారా ఐసిస్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడని గుర్తించారని తెలుస్తోంది.
ఏపీలోని గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు కూడా ఈ నెట్ వర్క్ ద్వారా ఐసిస్ వైపు ఆకర్షితులైనట్లుగా తెలుస్తోంది. వారిని హైదరాబాద్ మీదుగా సిరియా పంపించేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. నజీబ్ గురించి విచారణలో ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.
ఎన్ఐఏ కస్టడీకి ఇద్దరు ఉగ్ర అనుమానితులు
2 రోజుల క్రితం దేశవ్యాప్తంగా పట్టుబడిన ఉగ్రవాద అనుమానితుల్లో ఇద్దరిని ప్రత్యేక కోర్టు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్‌లో అరెస్టయిన అబు అనాస్, నఫీస్ ఖాన్‌లను ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications