108 పేజీలతో వెరైటీ శుభలేఖ, ఏముంది?ఎక్కడ?

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: తమ ఇంట్లో జరిగే వివాహ వేడుకలను గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలని భావిస్తారు.అయితే ఇందుకోసం ఎంతో ఖర్చుచేసి వివాహన్ని చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ తరహ పెళ్ళిళ్ళను చూస్తున్నాం. అయితే వరంగల్ కు చెందిన కల్వ శివప్రసాద్ దంపతులు తమ ఇంట్లో జరిగే వివాహనికి 108 పేజీల శుభలేఖను ముద్రించారు.

వరంగల్ కు చెందిన కల్వ శివప్రసాద్, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడి వివాహం ఈ నెల 14న, హైద్రాబాద్ లో ఉంది. వివాహం తర్వాత ఈ నెల 17న, హన్మకొండలో రిసెప్షన్ ఉంది. అయితే ఈ వివాహానికి బంధువులు, మిత్రులను ఆహ్వనించేందుకుగాను 108 పేజీల శుభలేఖను తయారుచేయించారు.

108 pages variety wedding card invitation in Warangal district

ఈ శుభలేఖ తొలిపేజీలో వివాహ వేడుకలకు సంబంధించిన తేదీలు, ఎక్కడెక్కడ వివాహం, రిసెప్షన్ జరుగుతాయి, వధూవరుల పేర్లతో పాటు వారి కుటుంబసభ్యుల పేర్లను పొందుపర్చారు. అంతేకాదు వివాహనికి ఆహ్వానించే శివప్రసాద్ దంపతుల ఫోటోలతో పాటు, నూతన వధూవరుల పోటోలు కూడ ఉంటాయి.

ఇక మిగిలిన పేజీల్లో సమగ్రసమాచారాన్ని పొందుపర్చారు. రైల్వే సమాచారం, ఆర్టీసి బస్సుల సమాచారం, హోటళ్ళు, విద్యుత్ కార్యాలయాలు, గ్యాస్ ఏజేన్సీల నెంబర్లను ముద్రించారు.

వరంగల్ లో వివాహం లేదా ఇతర శుభకార్యాలు నిర్వహించుకొనేందుకు అనువైన ఫంక్షన్ హాళ్ళ సమాచారం,పోలీస్ స్టేషన్ల వివరాలు, ఏ సమయాల్లో ఏ కార్యక్రమాల్లో నిర్వహించాలనే విషయాలపై కూడ ఈ శుభలేఖలో ముద్రించారు.

అయితే వెరైటీగా ముద్రించిన ఈ శుభలేఖను వివాహం తర్వాత కూడ తమ ఇంట్లోనే ఉంచుకొనేలా సమస్త సమాచారాన్ని పొందుపర్చారు.ఈ సమాచారం ప్రతి ఒక్కరిగా ఉపయోగపడుతోందని శివప్రసాద్ దంపతులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kalwa Shiv prasad couple printed a variety wedding card invitation.108 pages wedding invitation printed shiv prasad for his son's marriage.Railway, Rtc and other information available in this wedding invitation card.
Please Wait while comments are loading...