దేవుడిపై భారం: వీణా-వాణీల ఆపరేషన్‌కు పేరెంట్స్ లేఖ, అందుకే..

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అవిభక్త కవలలు వీణా వాణీలకు సర్జరీ చేయాలని తల్లిదండ్రులు లేఖ ఇచ్చారు. ఈ లేఖ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాము దేవుడి పైన భారం వేసి లేఖ ఇచ్చామని ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు.

వీణా-వాణీల అప్పగింత అంశం?: తల్లి సంతకం లేని లేఖతో నీలోఫర్‌కు తండ్రి

వీణ వాణిల తల్లిదండ్రులు మంగళవారం నాడు నీలోఫర్ ఆసుపత్రి వైద్యులతో భేటీ అయ్యారు. తమ కూతుళ్లకు సర్జరీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్జరీకి అంగీకారం తెలుపుతూ లేఖ కూడా ఇచ్చారు. ఈ లేఖను ప్రభుత్వానికి ఫార్వాడ్ చేస్తారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

veena-vani

ఈ సందర్భంగా వీణ వాణిల తల్లిదండ్రులు మాట్లాడుతూ... ఆపరేషన్ చేయించాలని తాము నిర్ణయించామని, ఆపరేషన్ చేస్తే ఒకరికి ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారని, కానీ ఆ దేవుడి పైన తాము భారం వేశామని చెబుతున్నారు.

వీణా-వాణీలను విడదీసేందుకు: సక్సెస్ రేట్ 80 శాతం (పిక్చర్స్)

ఇద్దరికీ ఇన్నేళ్లు వచ్చాయని, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని, ఒకరి గురించి మరొకరు స్వేచ్ఛను కోల్పోతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, వీణా వాణిలను ఇక ఇక్కడ ఉంచలేమని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. వారిని స్టేట్ హోంకు తరలించాలని భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
12 years on, conjoined twins Veena and Vani find hope of happy separation.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి