హైదరాబాద్ లో ఒక్క రోజులో 121 కేసులు - ప్రభుత్వం అప్రమత్తం: వేడుకలపై ఆంక్షలు..!!
దేశ వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో ఒక్క రోజులోనే పది ఒమిక్రాన్ కేసులు నిర్దారణ అయ్యాయి. ఇక, ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే కేసుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలో 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, బుధవారం ఏకంగా 235కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

గ్రేటర్ పరిధిలో పెరిగిన కేసులు
జీహెచ్‌ఎంసీలో 23వ తేదీన 93 కేసులు నమోదైతే, 28వ తేదీన 110 కేసులు, తాజాగా 121 కేసులు రికార్డు అయ్యాయి. వారం రోజుల్లో 11 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కాగా తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6.81 లక్షలకు చేరుకున్నాయి. ఒక రోజులో 204 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 6.73 లక్షల మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 4,024 మంది చనిపోయారు. ఇదిలావుండగా ముప్పున్న దేశాల నుంచి బుధవారం 346 మంది ప్రయాణికులు రాగా, అందులో 10 మందికి సాధారణ పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్ గా తేలని వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.

62 మంది ఓమిక్రాన్
శాంపిళ్లతో కలుపుకొని ఫలితాలు రావాల్సినవి 23 కేసులున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 62 మందికి ఒమిక్రాన్ వ్యాపించిందని అధికారులు వెల్లడించారు. వారిలో తాజాగా ఐదుగురు కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 18కి చేరిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటివరకు ముప్పున్న దేశాల నుంచి 12,267 మంది ప్రయాణీకులు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. గ్రేటర్ లో కరోనా కేసులు ఒక్క రోజులోనే 121 గా నిర్దారణ కావటంతో అధికారులు ప్రమత్తం అయ్యారు. ఇదే సమయంలో వేడుకల పైన పోలీసు అధికారులు ఆంక్షలు విధించారు.

పోలీసు శాఖ మార్గదర్శకాలు
స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసారు. చేశారు. న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ ఆనంద్ స్పష్టం చేసారు. పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు.. ఇక, స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండూ డోసులు తీసుకున్న వారికే మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఇవ్వాలని ఈవెంట్ల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, డిసెంబర్ 31వ తేదీన రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్టు వెల్లడించారు.. తాగి రోడ్లపై హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వం అప్రమత్తం..ఆదేశాలు
ఈవెంట్లకు పరిమితికి మించి పాసులను అమ్మొద్దు అని స్పష్టం చేసిన ఆయన.. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు.. ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దు అని సూచించారు. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని పోలీసు కమిషనర్ ఆనంద్ స్పష్టం చేసారు. ఇటు కరోనా..అటు విదేశాల నుంచి వచ్చిన వారిలో గుర్తిస్తున్న ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. మాస్కులు వినియోగం.. సోషల్ డిస్టన్స్ పాటించటం తో పాటుగా కరోనా ప్రోటోకాల్ ను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications