హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: 1275 మంది స్కూల్ విద్యార్థులు డ్రగ్స్ బానిసలు

డ్రగ్ రాకెట్ లో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పెద్ద ఎత్తున డ్రగ్స్ బారిన పడిన స్కూల్ విద్యార్థులున్నారని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ రాకెట్ లో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పెద్ద ఎత్తున డ్రగ్స్ బారిన పడిన స్కూల్ విద్యార్థులున్నారని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. హైద్రాబాద్ నగరానికి చెందిన స్కూళ్ళకు చెందిన 1,275 మంది విద్యార్థులు డ్రగ్స్ బారినపడ్డారని అధికారులు గుర్తించారు.

డ్రగ్ రాకెట్ హైద్రాబాద్ కు చెందిన స్కూళ్లు , సినీ పరిశ్రమతో పాటు ఐటీ ఇండస్ట్రీకి లింకులున్నట్టుగా అధికారులు గుర్తించారు.ఈ కేసుతో లింకులున్నవారి వివరాలను సేకరిస్తున్నారు.

1275 students drug addicts in various schools at Hyderabad

డ్రగ్ మాఫియా స్కూల్ పిల్లల్ని లక్ష్యంగా చేసుకొందని ఆయన అన్నారు. ప్రస్తుతానికి డ్రగ్స్ బారిన పడిన విద్యార్థులు 1275 మందిని గుర్తించింది.

డ్రగ్స్ వినియోగించే 200 వాట్సాప్, టెలిగ్రాం గ్రూప్ ను గుర్తించారు అధికారులు. ఒకే స్కూల్ చెందిన 20 మంది విద్యార్థులు డ్రగ్ కు బానిసలుగా మారారని ఎక్సై్జ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పారు.

అయితే ఫియర్ ఫేసీంగ్ వల్ల విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలుగా మారారని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం స్టూడెంట్స్ అందరి వివరాలు ఆయా స్కూల్ ప్రిన్సిఫల్స్ కు అందించామన్నారు.

డ్రగ్స్ కు బానిసలుగా మారిన విద్యార్థుల జాబితాను విడుదల చేయబోమన్నారు. డ్రగ్స్ వ్యవహరం బట్టబయలైందని విద్యార్థులు ఎవరూ కూడ అఘాయిత్యాలకు పాల్పడకూడదని ఆయన కోరారు.

English summary
1275 students were addicted drugs in various school at Hyderabad said officers. officers submitted to students names who were addicted drugs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X