తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 9 జిల్లాల్లో సున్నా కేసులు, పెరిగిన రికవరీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు అంతకుముందు రోజుతో పోలిస్తే తాజాగా కేసులు పెరిగాయి. గత 24 గంటల వ్యవధిలో 34,778 మంది నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 148 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.
తాజాగా, నమోదైన 148 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,73,722కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో ఇద్దరుమరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3975గా ఉంది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. కాగా, మరో 1206 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,66,012కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,735 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 00, భద్రాద్రి కొత్తగూడెంలో 04, జీహెచ్ఎంసీలో 50. జగిత్యాలలో 08, జనగామలో 01, జయశంకర్ భూపాలపల్లిలో 00, జోగులాంబ గద్వాలలో 00, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 14, ఖమ్మంలో 05, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 02, మహబూబాబాద్‌లో 02, మంచిర్యాలలో 07, మెదక్‌లో 00, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 08, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 05, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 01, నిజామాబాద్‌లో 04, పెద్దపల్లిలో 02, రాజన్న సిరిసిల్లలో 03, రంగారెడ్డిలో 09, సంగారెడ్డిలో 01, సిద్దిపేటలో 04, సూర్యాపేటలో 04, వికారాబాద్ లో 00, వనపర్తిలో 00, వరంగల్ రూరల్‌లో 04, వరంగల్ అర్బన్‌లో 05, యాదాద్రి భువనగిరిలో 03 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.












Click it and Unblock the Notifications