తెలంగాణ అసెంబ్లీలో ఈసారి 15 మంది డాక్టర్లు-జాబితాలో వీరే..!
తెలంగాణలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గతంలో భావోద్వేగాలతో జరిగే ఎన్నికలు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఎన్నికల అంశాల ఆధారంగా జరిగాయి. హామీలు, అభివృద్ధి అంశాలు, అభ్యర్ధుల గుణగణాలు, వారి నేపథ్యం ఇలా పలు అంశాల ఆధారంగా ఈ ఎన్నికలు జరిగాయి. దీంతో సహజంగానే ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పలువురు వృత్తి నిపుణులు అన్ని పార్టీల నుంచి విజయాలు సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్ధానాల్లో 15 మంది డాక్టర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో పలువురు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కూడా ఉన్నారు. అలాగే పలువురు యువ అభ్యర్ధులు ఉన్నారు. ఇందులోనూ తొలిసారి ఎమ్మెల్యేగా అదృష్టం పరీక్షించుకున్న వారు ఉన్నారు. వీరిలోనూ భిన్నమైన పార్టీలకు చెందిన వారు ఉన్నారు. దీంతో ఈసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన డాక్టర్లపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన డాక్టర్లలో డోర్నకల్ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ది రామచందర్ నాయక్, అచ్చంపేట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వంశీకృష్ణ, మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మురళీ నాయక్, మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్ధి సత్యనారాయణ, మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మైనంపల్లి రోహిత్, నారాయణ్ పేట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి పర్ణికా రెడ్డి, నారాయణ్ ఖేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి సంజీవరెడ్డి ఉన్నారు.

ఇదే క్రమంలో చెన్నూరు నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి భూపతి రెడ్డి, సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి రాగమయి, నాగర్ కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కూడా డాక్టర్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్ధి సంజయ్, భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల సంజయ్, సిర్పూర్ బీజేపీ అభ్యర్ధి పాల్వాయి హరీష్ కూడా ఈ డాక్టర్ల జాబితాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications