సైబర్ కేటుగాళ్ల మాయ.. మాజీ ఐపీఎస్ భార్యకు రూ. 2.58 కోట్లు టోకరా..
ఇటీవలికాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుడుల పేరుతో భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల మాయలో పడి రూ. కోట్లు పోగొట్టుకుంటున్నారు. గతేడాది కేవలంల 8 నెలల్లోనే సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.372 కోట్లు కొట్టేసినట్లు ఇటీవల పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటి కప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్ల మాయమాటలకు ఓ మాజీ ఐపీఎస్ భార్య మోసపోయింది.
హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్ల టోకరా వేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరతో భారీ మోసం చేశారు. కేవలం పది రోజుల్లోనే ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. మొత్తం 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు. వాట్సాప్ లో ప్రకటనలు నమ్మి మోసపోయినట్లు బాధితురాలు తెలిపారు.
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులంటూ ఏకంగా ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య నుంచే ఏకంగా రూ.2.58 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలుస్తోంది. ట్రేడింగ్ చిట్కాలు చెబుతామంటూ వాట్సాప్ లో ప్రకటనలతో నమ్మించి సైబర్ నేరగాళ్లు ఈ డబ్బును కాజేశారు. సైబర్ అసురుల మాయ మాటలను నమ్మి తన భర్త నంబరును వాట్సాప్ గ్రూప్ లో చేర్పించారు.

అలా తాము సూచించిన స్టాక్స్ లో పెట్టుబడులు పెడితే 500 శాతం లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పారు. ఈ క్రమంలో ఆమెను నమ్మించడానికి నకిలీ సెబీ సర్టిఫికెట్లు సైతం పంపించి మాయ చేశారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24వ తేదీ నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అంతేకాక మరింత డబ్బు పెట్టాలని బెదిరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications