ఇన్‌ఫెక్షన్, నొప్పి కారణంగా నిఖిల్ రెడ్డికి చికిత్స నిలిపివేత
హైదరాబాద్: పొడవు కావాలని కాళ్లకు ఆపరేషన్ చేయించుకొని, ప్రస్తుతం మంచానికే పరిమితమైన సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డి తీవ్ర నరకవేదన అనుభవిస్తున్నాడు. ఇప్పటికే మంచం దిగలేకపోతున్న అతనికి.. ఇన్‌ఫెక్షన్లు, తీవ్ర నొప్పి కారణంగా చికిత్స కూడా ఆపేశారు.
ఎత్తు కోసం ఆపరేషన్: 'నిఖిల్ రెడ్డి నరకయాతన, డాక్టర్లపై ఫిర్యాదునిఖిల్ రెడ్డికి ఆపరేషన్ జరిగి మూడు నెలలు కావొస్తోంది. ఇప్పటికీ ఆయన పరిస్థితి అగమ్యగోచరంగానే ఉంది. ఇప్పటికీ మంచం నుంచి కాళ్లు కిందపెట్టలేని పరిస్థితి. ఇన్‌పెక్షన్ సోకడానికి తోడు, నొప్పుల కారణంగా కొన్ని రోజులుగా చికిత్స నిలిపివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వారం రోజుల్లోనే కర్రల సాయంతో నడిపిస్తామని తన కొడుకుకు చెప్పి వైద్యులు మోసం చేసారని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నొప్పులతో నిఖిల్ రెడ్డి, ఆయన వేదన చూడలేక కుటుంబ సభ్యులు నరకం చూస్తున్నారు.
ఎత్తు కోసం నిఖిల్ రెడ్డికి ఆపరేషన్, ఎలాంటి మార్పు లేదు: ఎంసీఐకి ఫిర్యాదుఎత్తు పెరిగే ఆపరేషన్ చేస్తే రెండు నెలల్లో 2.5 అంగుళాలు పెరుగుతావని వైద్యులు నిఖిల్‌కు చెప్పి ఆపరేషన్ చేశారు. కానీ అంగుళం మాత్రమే పొడవు పెరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిఖిల్ కోలుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వైద్యులే చెప్పలేకపోతున్నారంటున్నారు. వైద్యుల తీరుపై ఇప్పటికే పోలీసులు, మానవ హక్కుల కమిషన్‌తో పాటు తెలంగాణ ఎయిమ్స్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications