ఎత్తు కోసం నిఖిల్ రెడ్డికి ఆపరేషన్, ఎలాంటి మార్పు లేదు: ఎంసీఐకి ఫిర్యాదు
హైదరాబాద్: పొడవు కావాలని రెండు నెలల క్రితం కాళ్లకు ఆపరేషన్ చేయించుకుని, ఇప్పుడు మంచానికే పరిమితమైన సాప్టువేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి అంశాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి గురువారం నాడు ఎంసీఐ (మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా) దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఎత్తు పెంచుతామని చెప్పి సాఫ్టువేర్ ఇంజినీర్ నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేసి రెండు నెలలైనా అతని కాళ్లలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. దీని పైన ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. అతనికి ఆపరేషన్ చేసిన గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం పైన మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు.
రెండు రోజుల క్రితం నిఖిల్ రెడ్డిని కిషన్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే మంచానికే పరిమితమైన నిఖిల్ రెడ్డిని పరామర్శించారు. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. నిఖిల్ రెడ్డి కాలుకు సంబంధించిన స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నిఖిల్ రెడ్డి అనే యువకుడి కాళ్లు కోసిన డాక్టర్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతురావు మంగళవారం సాయంత్రం గ్లోబల్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు కూడా. ఎత్తు పెరిగేందుకు గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు.
అనంతరం నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్దన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు తదితరులతో కలిసి లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి ఎదుట ఆయన భైఠాయించి, ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంటర్‌నెట్‌లో చూసి తెలిసో తెలియకో ఆసుపత్రికి వస్తే పెద్దలకు సమాచారమివ్వకుండా కాళ్లు ఎలా కోస్తారంటూ నిలదీశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications