హైదరాబాద్ లో చిట్టీల పేరుతో 20కోట్ల భారీ మోసం.. ఉడాయించిన భార్యాభర్తలు
మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఇక ముందు నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. చిట్టీల పేరుతో 20 కోట్ల రూపాయల మోసానికి పాల్పడి దంపతులు అదృశ్యమైన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
చిట్టీల వ్యాపారం పేరుతో మోసం
వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాపూజీ నగర్ కు చెందిన 53 సంవత్సరాల అమరేందర్ యాదవ్, 49 సంవత్సరాల సబితా దంపతులు అందరినీ నమ్మించి గత 20 సంవత్సరాలుగా ప్రైవేటు చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వారు చిట్టి పాట పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.

పోలీస్ స్టేషన్ లో బాధితుల ఫిర్యాదు
అయితే పోయిన నెలలో 14వ తేదీన దంపతులు ఇద్దరు కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే తమ చిట్టి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వారు పారిపోయారని తాము నష్టపోయామని భావించిన బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు .
పోలీస్ స్టేషన్ లో నిందితులు, బాధితుల ధర్నా
అయితే ఈ క్రమంలో మళ్లీ వాళ్లకు వాళ్లే వచ్చి పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఇక చిట్టి వ్యాపారం పేరుతో తమను మోసం చేశారని భావించిన నిందితులు మళ్లీ పోలీస్ స్టేషన్ కు వచ్చారని తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ధర్నా నిర్వహించారు . కానీ ఎంతో కష్టపడి కూడా పెట్టుకున్న డబ్బులు చిట్టిల వ్యాపారం పేరుతో తీసుకుని తమను మోసం చేశారని వాపోతున్నారు.
బాధితుల డిమాండ్ ఏమిటంటే
వారిని కఠినంగా శిక్షించాలని, తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఉన్నత చదువుల కోసం, వివిధ అవసరాల కోసం ఉపయోగించుకుందామని చిట్టీల రూపంలో దాచుకున్న డబ్బులు తీసుకొని భార్యాభర్తలు ఉడాయించారని వారు మండిపడుతున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఒక్కొక్కరం వారి వద్ద పది లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు చొప్పున చిట్టీలు వేసి మోసపోయామని అంటున్నారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని మహిళలు వృద్ధులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
నంద్యాలలో కిల్లర్ వైఫ్.. ప్రియుడిమోజులో భర్తను అలా.. -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..?












Click it and Unblock the Notifications