హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

200 రూపాయల కోసం క్యాబ్ డ్రైవర్ పై 20 మంది దాడి.. కోమాలో బాధితుడు: అసలేం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం రెండు వందల రూపాయల కోసం ఒక క్యాబ్ డ్రైవర్ పై అత్యంత దారుణంగా దాడి చేసిన ఘటన, ఆ డ్రైవర్ కోమాలో ఉండడంతో వెలుగులోకి వచ్చింది. అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బాల్క సుమన్ కాదు.. కేసీఆర్ దొరకు బానిస సుమన్: చెన్నూరులో వైఎస్ షర్మిల; తగ్గేదేలే!!బాల్క సుమన్ కాదు.. కేసీఆర్ దొరకు బానిస సుమన్: చెన్నూరులో వైఎస్ షర్మిల; తగ్గేదేలే!!

 క్యాబ్ డ్రైవర్ తో 200 రూపాయల విషయంలో యువకుడు వాగ్దాదం

క్యాబ్ డ్రైవర్ తో 200 రూపాయల విషయంలో యువకుడు వాగ్దాదం


నారాయణఖేడ్ కు చెందిన 27 సంవత్సరాల వెంకటేష్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. జూలై 31వ తేదీన రాత్రి సమయంలో వివేక్ రెడ్డి అనే యువకుడు బి.యన్.రెడ్డి నుండి ఉప్పర పల్లి వెళ్లడానికి వెంకటేష్ కు సంబంధించిన క్యాబ్ బుక్ చేసుకున్నాడు. దీంతో అతడిని ఎక్కించుకునేందుకు వెళ్ళిన వెంకటేష్ మార్గ మధ్యలో తన కారు యజమాని ని ఎక్కించుకొని, వివేక్ ను ఎక్కించుకున్నాడు. ఇక వివేక్ ను ఉప్పరపల్లి లో డ్రాప్ చేసిన తర్వాత డబ్బుల విషయంలో వివేక్ వెంకటేష్ మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ఆరు వందల రూపాయల బిల్లు అయితే, వివేక్ రెండు వందల రూపాయలు తక్కువగా ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగింది.

20 మంది స్నేహితులతో క్యాబ్ డ్రైవర్ పై దాడి .. ఆపై బాదితులపైనే ఫిర్యాదు

20 మంది స్నేహితులతో క్యాబ్ డ్రైవర్ పై దాడి .. ఆపై బాదితులపైనే ఫిర్యాదు


ఆగ్రహంతో ఊగిపోయిన వివేక్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలుచుకున్నాడు. మొత్తం 20 మంది క్యాబ్ డ్రైవర్ పైనా, కారు యజమాని పైన విచక్షణారహితంగా క్రికెట్ బ్యాట్ లు, వికెట్లతో దాడికి పాల్పడ్డారు. తమకు డబ్బులు వద్దు వదిలిపెట్టమని ఎంత ప్రాధేయపడినా వదిలిపెట్టకుండా దాడిచేసి, చివరకు దాడి చేసినవారు బాధితుల పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాయాలపాలైన బాధితులను ఆసుపత్రికి తరలించకుండా బాధితులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ క్రమంలో వెంకటేష్ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి తరలించారు.

 50 లక్షలు ఖర్చు పెట్టినా కోమా నుండి బయటకు రాని క్యాబ్ డ్రైవర్

50 లక్షలు ఖర్చు పెట్టినా కోమా నుండి బయటకు రాని క్యాబ్ డ్రైవర్


ఇక ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంకటేశ్ ఆరోగ్యం క్షీణించి కోమాలోకి వెళ్ళాడు. ఇప్పటి వరకు 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అతను తిరిగి మామూలు స్థితికి రాలేదు. వెంకటేష్ తల్లిదండ్రులు తమకు ఉన్న పొలాన్ని అమ్మి మరీ కొడుకు వైద్యం కోసం ఖర్చు పెట్టారు. తన కొడుకుని ఆదుకోవాలని తల్లిదండ్రులు దీనంగా రోదిస్తున్నారు. వెంకటేష్ కోమాలోకి వెళ్లడంతో పోలీసులు వివేక్ పై కేసు నమోదు చేశారు.

 ఆవేశమే ఈ అనర్ధానికి కారణం ..

ఆవేశమే ఈ అనర్ధానికి కారణం ..


వివేక్ కోర్టులో లొంగిపోగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేవలం రెండు వందల రూపాయల కోసం ఒక వ్యక్తిని 20 మంది కలిసి క్యాబ్ డ్రైవర్ ను చితకబాది, అతడు తిరిగి లేవలేని స్థితికి తీసుకు రావడంతో పాటు, వారు కూడా అనవసరంగా కేసులో ఇరుక్కున్నారు. అందుకే ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇంత పెద్ద అర్థానికే వారి ఆవేశమే కారణమైంది. ఒక క్యాబ్ డ్రైవర్ జీవితాన్ని నాశనం చేసింది.

English summary
The incident took place in Hyderabad where 20 people attacked a cab driver for just 200 rupees and the victim was in coma for three months
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X