తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: 4500 దిగువకు యాక్టివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 43,135 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 207 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది. అంతకుముందు రోజు 162 కరోనా కేసులే నమోదయ్యాయి.
తాజాగా, నమోదైన 207 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,66,753కు చేరింది. కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3923కు పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. కాగా, మరో 1316 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 239 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,58,409కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4421 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో
రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప క్షీణత నమోదైంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 03, భద్రాద్రి కొత్తగూడెంలో 04, జీహెచ్ఎంసీలో 61. జగిత్యాలలో 06, జనగామలో 03, జయశంకర్ భూపాలపల్లిలో 01, జోగులాంబ గద్వాలలో 03, కామారెడ్డిలో 00, కరీంనగర్‌లో 15, ఖమ్మంలో 13, కొమురంభీం ఆసిఫాబాద్ లో 01, మహబూబ్‌నగర్‌లో 03, మహబూబాబాద్‌లో 04, మంచిర్యాలలో 07, మెదక్‌లో 02, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 14, ములుగులో 00, నాగర్ కర్నూలులో 01, నల్గొండలో 09, నారాయణపేటలో 00, నిర్మల్‌లో 00, నిజామాబాద్‌లో 02, పెద్దపల్లిలో 08, రాజన్న సిరిసిల్లలో 04, రంగారెడ్డిలో 12, సంగారెడ్డిలో 02, సిద్దిపేటలో 06, సూర్యాపేటలో 04, వికారాబాద్ లో 01, వనపర్తిలో 01, వరంగల్ రూరల్‌లో 05, వరంగల్ అర్బన్‌లో 07, యాదాద్రి భువనగిరిలో 05 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కామారెడ్డి, ములుగు, నారాయణ్ పేట్, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
Recommended Video
మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 9,91,676 నమూనాలన పరీక్షించగా 20,799 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. నిన్నటితో పోల్చితే(22,842) కొత్త కేసులు తక్కువగా కావడం గమనార్మం. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,38,34,702కు చేరింది. ఆదివారం 180 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4,48,997కి చేరింది. ఆదివారం 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,31,21,247కి పెరిగింది. రికవరీ ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది. ప్రస్తుతం దేశంలో 2,64,458 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 90.79,32,861కు చేరింది.












Click it and Unblock the Notifications