అమెరికాలో తెలంగాణ యువకుడు ఎం. వంశీరెడ్డి ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu
  Telangana youth ends life in US అమెరికాలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య | Oneindia Telugu

  హైదరాబాద్: తెలంగాణకు చెందిన 23 ఏళ్ళ ముద్దసాని రాజా వంశీరెడ్డి మిచిగాన్ యూనివర్శిటీలో సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

  ఈ ఏడాది వేసవికాలంలోనే ఫ్లోరిడా నుండి మిచిగాన్‌కు వంశీరెడ్డి వచ్చారు.వంశీరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై మిచిగాన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

  23-year-old Telangana youth ends life in the US

  తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ వంశీరెడ్డి బౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ మేరకు ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరిస్తున్నారు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్.

  వంశీరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.మంగళవారం నాడు వంశీరెడ్డి కుటుంబసభ్యులకు ఈ విషయాన్ని మిచిగాన్ పోలీసులు చేరవేశారు.

  వంశీరెడ్డి భౌతికకాయాన్ని స్వగ్రామాన్ని తరలించేందుకు గాను 50వేల డాలర్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం. అయితే 12 గంటల్లోనే 350 మంది సుమారు 13వేల డాలర్లను విరాళంగా ఇచ్చారు. సోషల్ మీడియా కేంద్రంగా క్యాంపెయిన్ నిర్వహించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Twenty-three-year-old Raja Vamshi Reddy Muddasani from Telangana committed suicide at University of Michigan on Monday. Raja had moved to Michigan from Florida this summer. The Michigan police is investigating the case and the reason behind the suicide is still not clear.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి