Telangana Covid cases : తెలంగాణలో కొత్తగా 296 కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. మరో 1181 రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,302కి చేరింది.ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3,893కి చేరింది. తాజాగా మరో 322 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,52,085కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 69,833 శాంపిల్స్‌ను పరీక్షంచగా... ఇప్పటివరకూ మొత్తం 2,53,78,513 శాంపిల్స్‌ను పరీక్షించారు. జాతీయ స్థాయిలో మరణాల రేటు 1.3శాతం ఉండగా రాష్ట్ర స్థాయిలో మరణాల రేటు 0.58శాతంగా ఉంది.జాతీయ స్థాయిలో రికవరీ రేటు 98.60శాతం ఉండగా రాష్ట్రంలో రికవరీ రేటు 97.45శాతంగా ఉంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 5324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 74, జగిత్యాల 13, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 2, కామారెడ్డి 2, కరీంనగర్ 43, ఖమ్మం 23, మహబూబ్‌నగర్ 0, కొమురంభీం ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 8, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 15, ములుగు 4, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 15, నారాయణపేట 0, నిజామాబాద్ 5, పెద్దపల్లి 9, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 12, సిద్దిపేట 1, సంగారెడ్డి 1, సూర్యాపేట 6, వికారాబాద్ 0, వనపర్తి 4, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 22, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే... గడిచిన 24గంటల్లో 33,376 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 25,010 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మరో 308 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క కేరళలోనే 177 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3.91 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 1.18 శాతంగా నమోదయింది. ఇప్పటివరకూ కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,42,317కి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15.92 లక్షల మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.32 కోట్లను దాటింది.












Click it and Unblock the Notifications