'కేసీఆర్‌పై 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అసహనం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు 20 మంది తెరాస ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని చెప్పారు. తాజాగా, 30 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారన్నారు.

తెరాస మంత్రుల్లో తెలంగాణను వ్యతిరేకించిన వారు, అమరవీరుల స్థూపం వద్దకు రాని వారు కూడా ఉన్నారని, ఇది తెలంగాణవాదులను భాధిస్తోందన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే శాసన సభను రద్దు చేయాలని సవాల్ విసిరారు.
ప్రజాస్వామ్య విలువలను కేసీఆర్ తొక్కిపెట్టాలన్నారు. అది ఆయనకే సమస్యగా మారుతోందన్నారు. తెరాస ఐదో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడిస్తేనే, అమరవీరుల ఆత్మకు శాంతి కలుగుతుందని, ఆత్మసాక్షి ప్రకారం తెరాస ఎమ్మెల్యేలు ఓటు వేయాలన్నారు.












Click it and Unblock the Notifications