వారి ఖాతాలో నెలకు ఐదు వేల రూపాయలు.. కేంద్రం శుభవార్త!
భారతదేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడానికి కేంద్రం తీసుకువచ్చిన వినూత్న పథకం ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం ద్వారా ప్రయత్నాలు సాగిస్తోంది.
కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ ద్వారా రాబోయే 5సంవత్సరాల్లో దేశంలోని టాప్ 500 కంపెనీలలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా యువత ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యపరమైన శిక్షణతో కూడిన విద్యను, 12 నెలలు పారిశ్రామిక అనుభవం అందించాలని సంకల్పించింది.

ఇంటర్న్ షిప్ పథకానికి అర్హతలు ఇవే
20 కంటే ఎక్కువ రంగాలలో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే వారికి దేశవ్యాప్తంగా అవకాశాలు ఉంటాయి. విద్యార్హతల విషయానికొస్తే
ఇంటర్న్షిప్ స్కీమ్ కు అర్హత సాధించడానికి,దరఖాస్తుదారులు తమ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి .ఐటిఐ నుండి సర్టిఫికేట్,పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా లేదా BA, BSc, BCom, BCA, BBA BPharm, B.Tech వంటి డిగ్రీని కలిగి ఉండాలి.
ఈ పథకం వర్తించే వారికి బీమా కవరేజీ
ఆన్లైన్ లేదా దూరవిద్య ప్రోగ్రామ్ లలో నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందులో ఇంటర్న్ షిప్ పొందేవారికి భారత ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ అందిస్తుంది. అర్హత,ఆసక్తిగల అభ్యర్థులు ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకోవాలి.
నెలకు 5 వేల రూపాయలు
https://pminternship.mca.gov.in/ వెబ్సైట్ ద్వారా ఈ ఇంటర్న్షిప్ కోసం ఆధార్, బయోడేటాతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని,ఎంపికైన వారికి 12 నెలలపాటు రూ.5 వేల చొప్పున అందిస్తారు. అలాగే ఏకకాల గ్రాంటు కింద రూ.6 వేలు కూడా ఇస్తారు. ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం జనవరి 10వ తేదీన ప్రారంభమైంది. జనవరి 21వ తేది దీనికి ఆఖరు తేదీ.21-24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. మరెందుకాలస్యం ఆర్హతలు ఉన్నవారు ట్రై చెయ్యండి.












Click it and Unblock the Notifications