వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. దాదాపు 60 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంత భారీ ఎత్తున బదిలీలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తాజా బదిలీలను పరిశీలిస్తే.. జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా అబ్దుల్ అజీమ్, జగిత్యాల కలెక్టర్‌గా శరత్, వికారాబాద్ కలెక్టర్‌గా పౌసుమీ బసు, కొత్తగూడెం కలెక్టర్‌గా ఎంవీ రెడ్డి, నారాయణ్‌పేట్ కలెక్టర్‌గా హరిచందన, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా దేవసేన బదిలీ అయ్యారు. హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు, మహబూబ్ నగర్ కలెక్టర్‌గా వెంకట్రావ్,నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పాటిల్ ప్రశాంత్ జీవన్, ఆసిఫాబాద్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్, నిజామాబాద్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ బదిలీ అయ్యారు. వరంగల్ అర్బన్ హనుమంతు, ములుగు కలెక్టర్‌గా కృష్ణ ఆదిత్య, బదిలీ అయ్యారు.

60 IAS officers transferred in major administrative reshuffle in telangana

చివరిసారిగా గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఐఏఎస్‌లను బదిలీలను చేపట్టింది. ఆ సమయంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా బుసాని వెంకటేశ్వర్ రావును నియమించారు. ఎం.సి.హెచ్.ఆర్.డి. అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఏ.అశోక్‌ని, కరీంనగర్ కలెక్టర్‌గా కే. శశాంక్‌ని నియమించారు. ఆయన ఇదివరకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.కరీంనగర్ కలెక్టర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు కీలకబాధ్యతలప్పగించిన కేసీఆర్ ప్రభుత్వం ఆయన్ని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. శ్వేత మహంతికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలిచ్చారు.

English summary
In a major administrative reshuffle, the Telangana government has issued transfer and posting orders of 60 IAS officers with immediate effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X