తెలంగాణ ప్రజలకు సర్కారు గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి మరో 65 చికిత్సలను చేర్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నెముక సంబంధించి తదితర చికిత్సలను పథకం జాబితాలో చేర్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందుకు అవసరమైన రూ.497 కోట్ల 29 లక్షలను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

కాగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,402 ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 1,672 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వైద్య నిపుణుల సూచనల మేరకు 1,375 చికిత్సలకు ప్యాకేజీల ధరను పెంచింది. ప్రభుత్వం ఈ పథకం కింద ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల విలువ గల వైద్యాన్ని అందిస్తోంది. సుమారు 2.84కోట్ల మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

65 New medical treatments Added in Aarogyasri in Telangana

మరోవైపు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలుపై జూన్ 7న సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలు పెంచడంతో పాటు కొత్త చికిత్సలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ప్రస్తుతం ఉన్న 1,375 చికిత్సలకు ధరలు పెంచడంతో పాటు 65 కొత్త చికిత్స విధానాలను చేర్చాలని భావించారు. ఇక, రాజీవ్ ఆరోగ్యశ్రీ లేని వారికి ఆయుష్మాన్ భారత్‌​లోని 98 చికిత్స విధానాలకు సుమారు రూ.189.93 కోట్లతో పాటు కొత్తగా చేర్చిన 65 చికిత్సలకు దాదాపు రూ.158.20 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+