తెలంగాణలో కొత్తగా 66 కరోనా కేసులు, మూడు మరణాలు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో సోమవారం కొత్తగా 66 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1920కి పెరిగింది. సోమవారం 72 మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1164కు చేరింది.

సోమవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 56గా ఉంది. ప్రస్తుతం 700 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ నుంచి 31, రంగారెడ్డిలో 1 ఉన్నాయి. 15 మంది ఇతర రాష్ట్రాలు వాళ్లు కాగా, ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, మిగిలిన వ్యక్తులు 18 మంది విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.

66 new corona positive cases recorded in telangana, deaths toll to 56.

కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,44,118కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 79,823 ఉండగా, 60,137 మంది కోలుకున్నారు. 4147 మరణాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 52,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 17,082, గుజరాత్ రాష్ట్రంలో 14,468, ఢిల్లీలో 14,053 కరోనా కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+