దారుణం: మైనర్ బాలికను రేప్ చేసిన చిన్నాన్నలు
మహబూబ్‌నగర్: జిల్లాలోని వెల్డండ మండలం అజిలాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై ఇద్దరు సొంత చిన్నానలు అత్యాచారం చేశారు. చికిత్స నిమిత్తం బాలికను కల్వకూర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంం నలుగురు మృతి
మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం కాల్లకల్ దగ్గర ఆటోను లారీ ఢీకొంది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారులు నిర్వహించిన తనిఖీలో దుబాయి నుంచి వచ్చిన మహిళ నుంచి 700 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితురాలిని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications