పిల్లలను చూడనివ్వలేదని ఫినాయిల్ తాగిన భర్త

పోలీసుల కథనం ప్రకారం.. బేగంపేట పోలీస్‌లైన్‌లో నివాసముంటున్న ఎండి మతీమ్(42)కు 18ఏళ్ల కిందట చిలకలగూడకు చెందిన నఫీజాబేగంతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యాభర్తలు విడిపోగా భార్య చిలగూడలో ఉంటున్నారు. నవంబర్ 20న పిల్లలను చూసేందుకు మతీమ్ భార్య ఇంటికి వచ్చాడు.
పిల్లలను చూపించమని భార్యను మతీమ్ కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆవేదనకు గురైన మతీమ్ దూద్‌బావిలో ఉన్న ఖాళీ స్థలంలో పినాయిల్ తాగిపడిపోయాడు. అతడ్ని గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మహిళ గొంతుకోసి హత్యాయత్నం
జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఓ గృహిణి గొంతుకోసి హత్య చేయడానికి యత్నించాడు. జీడిమెట్ల సిఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం. సంజయ్ గాంధీనగర్‌కు చెందిన ఆనంద్ జీడిమెట్లలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో అతను రెండో షిప్టు విధులకు వెళ్లాడు.
అనంతరం అతని భార్య సునీత(27) అదే ప్రాంతంలో నివసిస్తున్న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమెను దారిలో ఆటకాయించి గొంతుకోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమె రాత్రి ఒంటిగంటకు ఇంటికి చేరుకుంది.
అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను ఇరుగుపొరుగువారు గమనించి భర్తకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న భర్త ఆమెను ఆదివారం తెల్లవారుజామున షాపూర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గొంతుకు తీవ్రంగా గాయం కావడంతో ఆమె ప్రస్తుతం మాట్లాడలేకపోతోందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications