ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి కుమారుడినంటూ లక్షలు కాజేశాడు: చివరికి చిక్కాడిలా!

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: తాను ఓ మంత్రి కొడుకునని చెప్పుకుంటూ అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ యువకుడు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు గుంజాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడ్ని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆదిలాబాద్‌లోని వన్‌టౌన్‌లో మంగళవారం డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన జనగం సమ్మయ్య కొన్ని రోజులుగా ఈ మోసానికి పాల్పడుతున్నాడు. తాను మంత్రి
జోగు రామన్న పెద్ద కుమారుడు ప్రేమేందర్‌నని ఫోన్లు చేస్తూ.. ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురికి నమ్మబలికాడు.

 A man arrested for cheating as minister's son in adilabad

చెన్నూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.2.15 లక్షలు వసూలు చేశాడు. నేరుగా కలిస్తే గుర్తుపట్టే అవకాశం ఉండటంతో ఆ వ్యక్తిని కలవకుండానే ఇతరులను పంపించి డబ్బులు తీసుకునేవాడు సమ్మయ్య. మరో రూ.7 లక్షలు కావాలని చెప్పడంతో బాధితుడు అంగీకరించారు.

అయితే చర్చ సందర్భంగా బాధితుడు ఈ విషయాన్ని తన సన్నిహితుడి వద్ద వెల్లడించడంతో సదరు స్నేహితుడు ప్రేమేందర్‌ అలాంటి వ్యక్తి కాదని.. ఇలాంటి పనులకు దూరంగా ఉంటారని చెప్పాడు. దీంతో అసలు విషయం తెలిసిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని వల పన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. గతంలోనూ నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ సురేష్‌, ఎస్సై అనిల్‌ తదితరులు ఉన్నారు.

English summary
A man arrested for cheating unemployed youth as minister's son, in Adilabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X