హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Viral Video: హైదరాబాద్ విమానంలో మహిళా సిబ్బంది పట్ల దౌర్జన్యం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విమానాల్లో తోటి ప్రయాణికులు, సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించే సందర్భాలు ఈ మధ్యకాలంలో మితిమీరిపోతున్నాయి. ఎయిరిండియా విమానంలో ముంబైకి చెందిన శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనను- డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

ఇద్దరు పైలెట్ల లైసెన్సులను మూడు నెలల పాటు రద్దు చేసింది. ఎయిరిండియా యాజమాన్యంపై 30 లక్షల రూపాయాల జరిమానా విధించింది. అటు ఎయిరిండియా కూడా మూత్రం పోసిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న శంకర్ మిశ్రాపై చర్యలు తీసుకుంది. నాలుగు నెలల పాటు విమానంలో ప్రయాణించకుండా నిషేధాన్ని విధించింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ కూడా చేశారు.

ఇప్పుడు తాజాగా- స్పైస్ జెట్ విమానంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహిళా సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడో ప్రయాణికుడు. దౌర్జన్యం చేశాడు. మహిళా సిబ్బందితో ఆ ప్రయాణికుడు గట్టిగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని స్పైస్ జెట్ యాజమాన్యం ధృవీకరించింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. దీన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొంది.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరాల్సిన ఎస్‌జీ-8133 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు మహిళా సిబ్బందితో గట్టిగా మాట్లాడటం ఈ వీడియోలో రికార్డయింది. ఆ ప్రయాణికుడిని వారించడానికి మరో ఇద్దరు సిబ్బంది రావడం, అతణ్ని శాంతింపజేయడం కనిపించింది.

A passenger on Delhi- Hyderabad Spicejet flight has been accused of harassing the cabin crew

అనంతరం సిబ్బంది ఆ ప్రయాణికుడితో పాటు అతని వెంట ఉన్న మరొకరిని విమానం నుంచి విమానం నుంచి కిందికి దించేశారు. ఆ ఇద్దరినీ విమానాశ్రయం సెక్యూరిటీ అధికారులకు అప్పగించారు. ఈ గొడవ చోటు చేసుకోవడానికి గల కారణాల గురించి స్పెస్ జెట్ యాజమాన్యం వెల్లడించలేదు. దీనికి గురించి ఆరా తీస్తోన్నామని తెలిపింది.

English summary
A passenger on Delhi- Hyderabad Spicejet flight has been accused of misbehaving and harassing the cabin crew by acting in an inappropriate manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X