కూలీతో స్కూల్ టీచర్ ఎఫైర్.. భర్తను చంపి షాకింగ్ స్కెచ్.. చివరకు ఏమైందంటే!
సమాజంలో రోజురోజుకీ మానవ సంబంధాలు క్షీణించిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు, భార్యలను భర్తలు చంపుకుంటున్న రోజులు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు మేడిపల్లిలో వివాహేతర సంబంధంతో ఓ భార్య భర్తను దారుణంగా హత్య చేసింది. ఆ హత్యను గుండెపోటుగా చిత్రీకరించి సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయం విని షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
కూలీతో స్కూల్ టీచర్ వివాహేతర సంబంధం
కర్ణాటకకు చెందిన అశోక్, పూర్ణిమ దంపతులకు 2011లో వివాహమైంది. వీరికి 12సంవత్సరాల కొడుకు ఉన్నాడు అశోక్ యన్నం పేటలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో లాజిస్టిక్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. పూర్ణిమ తన నివాసంలోనే ఒక ప్లే స్కూల్ ను రన్ చేస్తోంది. అయితే పూర్ణిమకు గతంలో నివసించిన ప్రాంతంలో ప్రకాశం జిల్లా కు చెందిన కూలీ పాలేటి మహేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్
ఇది తెలిసిన అశోక్ భార్యను మందలించి వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న పూర్ణిమ ప్రియుడు మహేష్ ను సహాయం కోరింది. మహేష్ తన స్నేహితుడైన సాయికుమార్ సాయంతో ఈనెల 11వ తేదీ సాయంత్రం అశోక్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి కింద పడేశారు.
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
పూర్ణిమ, సాయికుమార్ అశోక్ ని గట్టిగా పట్టుకోగా మహేష్ మూడు చున్నీలను కలిపి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అశోక్ మరణించినట్టు నిర్ధారించుకున్న తర్వాత నిందితులిద్దరూ అక్కడనుండి వెళ్ళిపోయారు. ఇక హత్యను సహజ మరణంగా నమ్మించడానికి పూర్ణిమ నాటకం ఆడింది. భర్త ఆఫీసు నుంచి వచ్చి అలసిపోయి పడకగదికి వెళ్ళాడని, తాను స్కూల్ ముగించుకొని లోపలికి వచ్చేసరికి బాత్రూంలో స్పృహ తప్పి పడి ఉన్నాడని అందరినీ నమ్మించింది.
గుండెపోటు అని నమ్మించే యత్నం.. చివరకు ఇలా
గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు కూడా ప్రకటించారని పోలీసులకు ఫిర్యాదు చేసి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేయాలని ప్లాన్ చేసింది. అయితే మృతుడు శరీరం పైన గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంటి పరిసరాలలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు అశోక్ చనిపోయిన సమయంలో వారి ఇంటికి మహేష్, సాయికుమార్ వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయింది. వీటి ఆధారంగా వారిరువురిని అదుపులోనికి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో నిందితులు ముగ్గురిని పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది!












Click it and Unblock the Notifications