సహజీవనం..: హైదరాబాద్ టెక్కీకి బెంగళూరు టెక్కీ వేధింపులు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/బెంగళూరు: హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను బెంగళూరులోని మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేధింపులకు గురిచేశాడు. తనకు దూరమవుతుందన్న నెపంతో గతంలో కలిసి తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన యువతి, కర్ణాటకకు చెందిన మహేశ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొంతకాలం కలిసి పని చేశారు.

A techie allegedy harassed by another

ఈ సమయంలోనే వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. ఇటీవల యువతికి హైదరాబాద్‌కు బదిలీ కావడంతో వారి మధ్య దూరం పెరిగింది.

ఈ క్రమంలో తనతో కలిసి ఉండాలని, లేదంటే సహజీవనం చేసిన సమయంలో తీసిన ఫొటోలను బయటపెడతానని మహేశ్.. ఆ యువతిని బెదిరింపులకు గురిచేశాడు. అయినా, అతనను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఆ ఫొటోలను ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ పంపించాడు.

ఈ నేపథ్యంలో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A techie allegedy harassed by another in Bengaluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X