వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: రోడ్డుపైకి పిల్లలను తీసుకెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..

|
Google Oneindia TeluguNews

రోడ్డుపైకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హైవేలపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లలతో పాటు రోడ్డు దాటుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలతో రోడ్డు దాటుతున్నప్పుడు వారిని పట్టుకోవాలి. పిల్లల్ని పట్టుకోకుండా వదిలిపెడితే వారు రోడ్డుపై పరుగెత్తే ప్రమాదం ఉంది.

పరుగెత్తింది

పరుగెత్తింది


తాజాగా ఓ పాప రోడ్డుపై తల్లిని విడిచి పెట్టి పరుగెత్తింది. అదే సమయంలో వేగంగా వస్తున్న వాహనం పాపను ఢీకొట్టింది. ఈ ఘటనలో పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

షామీర్ పేట

షామీర్ పేట


ఈ వీడియోలో ఓ తల్లి తన కూతురితో రోడ్డు దాటుతుంది. పాప ఆమె రోడ్డు దాటడానికి డివైడర్ వరకు వచ్చింది. అప్పడే పాప తిరిగి వెనక్కు పరుగెత్తింది. అటు వేగంగా వస్తున్న టాటా ఏసీ పాపను ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన పాప అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో జరిగింది.

ఎస్సై శ్వేత


రోడ్డు దాటేటప్పుడు పిల్లల చేతులను తప్పకుండా పట్టుకోవాలని ట్రాఫిక్ ఎస్సై శ్వేత చెప్పారు. చిన్న పిల్లలతో రోడ్డు దాటేటప్పు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డు ఎలా దాటాలో పిల్లలకు చెప్పాలన్నారు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు పిల్లల చేయి వదిలిపెట్టకూడదని తెలిపారు. జీబ్ర క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలని సూచించారు. ఫుట్ పాత్ ఉపయోగించుకోవాలి కోరారు.

English summary
Be careful when going on the road. Be very careful especially on highways. Be alert while crossing the road with children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X