ఘర్షణ: బాలుడ్ని ఎందుకొట్టారని అడిగితే.. మహిళకు నిప్పుపెట్టారు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కారుకు అడ్డంగా వచ్చిన బాలుడిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించిన ఒక మహిళను చంపాలన్న కసితో పెట్రోల్‌ పోసి నిప్పంటించారు దుర్మార్గులు.  ఈ ఘటన వడ్డెరబస్తీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మహిళను చంపేందుకు యత్నించారంటూ ఆగ్రహించిన బస్తీజనం రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న తుకారాంగేట్‌ పోలీసులు 8 మందిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మినారాయణ, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌ వడ్డెరబస్తీకు చెందిన ఇసుక కాంట్రాక్టర్‌ మల్లేశ్‌ ఆదివారం ఉదయం కారులో ఇంటికి వస్తుండగా వేణు అనే బాలుడు వాహనానికి అడ్డుగా వచ్చాడు. దీంతో కోపగించిన మల్లేశ్‌ అతడిని కొట్టాడు.

ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు మల్లేశ్‌ ఇంటి పక్కనే ఉండే చంద్రకళకు సాయంత్రం చెప్పారు. దీంతో చంద్రకళ (40), ఆమె కుమారుడు శ్రీకాంత్‌ బాలుడిని ఎందుకు కొట్టావంటూ మల్లేశ్‌ను నిలదీశారు. దీంతో మల్లేశ్‌ కుమారుడు శ్రీనివాస్‌ ఆగ్రహంతో వచ్చి చంద్రకళ కుమారుడు శ్రీకాంత్‌ను కొట్టడంతో తలకు గాయమైంది. దీనిపై తుకారాంగేట్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా, మల్లేశ్‌ సోమవారం ఉదయం మాట్లాడుకుందామంటూ ఇంటికి పిలిచాడు.

అయితే, ఇంటికి వచ్చిన చంద్రకళపై దాడికి మల్లేశ్‌ కుటుంబ సభ్యులు ప్రణాళిక వేసుకున్నారు. చంద్రకళతో పాటు బస్తీవాసులు రాగానే మల్లేశ్‌ వర్గీయులు రాళ్ల దాడి చేస్తూ వెంబడించారు. మల్లేశ్‌ మేనల్లుడు బంటి.. చంద్రకళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బస్తీవాసులు మంటలను ఆర్పేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రతిదాడులు చేసుకుంటుండగా పోలీసులు వచ్చి చెదరగొట్టారు.

చంద్రకళ శరీరం 23శాతం కాలిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హత్యాయత్నం తదితర కేసుల కింద మల్లేశ్‌, బంటి సహా మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్సై సామ్యానాయక్‌ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.

బాలికపై అత్యాచారం: పురుగుల మందు తాగించారు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని సాతంరాయి శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికకు పురుగుల మందు తాగించి ఇద్ద్గరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం గ్రామశివారులో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక, మరో యువకుడిని పశువుల కాపరులు గుర్తించి గ్రామస్థులకు సమాచారమందించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

స్థానికులు, శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసుల తెలిపిన ప్రకారం.. శాతంరాయి గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శనివారం రాత్రి అపహరించారు. అనంతరం గ్రామ శివారులోని ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత బాలికకు పురుగుల మందు తాగించి లైంగికదాడి చేశారు. ఆదివారం ఉదయం బాలిక ఓ చోట, మరికొద్ది దూరంలో జగన్ అనే యువకుడు మరోచోట అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన ఓ మహిళ గ్రామస్థులకు సమాచారమందించింది. అయితే ఆ యువకుడు కూడా పురుగుల మందు తాగి ఉండటం గమనార్హం.

ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు బాధిత బాలికతోపాటు జగన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సంబంధమున్న మరో యువకుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాలికను, ఆమె కుటుంబాన్ని చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రీ పరామర్శించారు.

బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తెలిసిన వ్యక్తులు చేసిన పనేని భావిస్తున్నారు. కాగా, బాధిత బాలికను జగన్ ప్రేమిస్తున్నట్టు తెలిసింది. బాధితురాలు స్పృహలోకి వచ్చి తన వాంగ్మూలం ఇస్తేగానీ అసలేమైందన్న విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

బాధిత మహిళ చంద్రకళ

బాధిత మహిళ చంద్రకళ

కారుకు అడ్డంగా వచ్చిన బాలుడిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించిన ఒక మహిళను చంపాలన్న కసితో పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన సికింద్రాబాద్‌లోని వడ్డెరబస్తీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

చికిత్స పొందుతున్న బాధితురాలు

చికిత్స పొందుతున్న బాధితురాలు

మహిళను చంపేందుకు యత్నించారంటూ ఆగ్రహించిన బస్తీజనం రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పోలీసుల పహారా

పోలీసుల పహారా

సమాచారం అందుకున్న తుకారాంగేట్‌ పోలీసులు 8 మందిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.

గాయపడిన యువకుడు

గాయపడిన యువకుడు

చంద్రకళ శరీరం 23శాతం కాలిందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హత్యాయత్నం తదితర కేసుల కింద మల్లేశ్‌, బంటి సహా మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్సై సామ్యానాయక్‌ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly burned alive in Secunderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి