విషాదం: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన తల్లి
కరీంనగర్: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఇల్లంతకుంటలో గురువారం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందాడు.
ఆస్పత్రి నుంచి వెంకటేశ్వర్లు మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లి నాగమ్మ(70) తట్టుకోలేక పోయింది. బోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది. కొన్ని గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందటంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

లారీ యజమానిని హతమార్చిన క్లీనర్
లారీ యజమాని నిద్రిస్తుండగా గొంతు కోసి హతమార్చి క్లీనర్ నగదుతో పరారయిన సంఘటన గురువారం నల్గొండ జిల్లా ఈదులగూడెంలో జరిగింది. యజమాని సాయిబాబా లారీలో నిద్రిస్తుండగా క్లీనర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతుడు సాయిబాబా జగ్గయ్యపేట మండలానికి చెందినవాడని పోలీసులు తెలిపారు.
అశ్వారావుపేటలో భారీ చోరీ
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని మూర్తిరాజు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు చొరబడి కిలో వెండి, బంగారం, లక్షన్నర విలువచేసే పట్టుచీరలను దోచుకుపోయారు. గురువారం తెల్లవారుజామున మూర్తిరాజు లేచి చూడగా తలుపులు బార్లా తీసి ఉన్నాయి. దీంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications