వీడు మొగుడేనా?: భార్యను మామలతో గడపాలని ఒత్తిడి, ఆమె ఏం చేసిందంటే..

Subscribe to Oneindia Telugu

హైదరబాద్: కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన మామ కేసులో మరో దారుణం వెలుగుచూసింది. సంతానం కలగాలంటే తన నాన్న, చిన్నాన్నలతో గడపాలని బాధితురాలిని ఆమె భర్తే ఒత్తిడి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌ మోయిన్‌బాగ్‌కు చెందిన మహిళకు(23)కు ఈదిబజార్‌కు చెందిన ముజమిల్‌ మునీర్‌(26)తో గత సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. మునీర్‌ తల్లిదండ్రులు సౌదీ అరేబియాలో ఉంటుండగా, అతని చిన్నాన్న ముబీనోద్దీన్‌(45) చంచల్‌గూడలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఈదిబజార్‌కు వచ్చే ముబీనోద్దీన్‌ వరుసకు కుమారుడైన మునీర్‌ భార్యపై కన్నేశాడు.

A woman complained to police on her husband and uncle

ఈ క్రమంలోనే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు ఈ విషయాన్ని భర్త మునీర్, అత్త, మామలకు దృష్టికి తీసుకెళ్లింది. అయితే వారు అతడిని మందలించకపోగా ఇలాంటి విషయాలు బయట చెప్పుకుంటే పరువు పోతుందని, సంతానం కోసం అతను చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు.

బాధితురాలికి ఆమె భర్త మునీర్‌ అండగా నిలవకపోగా.. 'నీకు సంతానం కలగాలంటే తన తండ్రి లేదా పినతండ్రితో గడపాలంటూ భార్యపై ఒత్తిడి చేశాడు. దీనిని అలుసుగా తీసుకున్న ముబీనోద్దీన్‌ మరింత రెచ్చిపోయి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. మార్చి 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు ముబీనోద్దీన్. ఈ క్రమంలో బాధితురాలు అతడ్నుంచి తప్పించుకుని పుట్టింటికి వెళ్లింది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోష్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కాగా, స్థానిక పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో బాధితురాలు మంగళవారం రాత్రి దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కేసు నమోదు చేసి విచారణ జరపాలని డీసీపీ ఆదేశించడంతో పోలీసులు మునీర్, ముబీనోద్దీన్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman has complained to police on her husband and uncle for rape attempt in Hyderabad.
Please Wait while comments are loading...