సెల్ పోయిందని సిల్లీ రీజన్ కే సూసైడ్ చేసుకున్న యువకుడు
చనిపోవడానికి బలమైన కారణాలు కూడా అవసరం లేకుండా పోతోంది. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన చేస్తున్న యువత అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.
తాజాగా సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను అన్న ఒకే ఒక్క కారణంతో ఓ యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరిని ఆలోచించేలా చేస్తోంది.

కామారెడ్డి జిల్లా ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్న ఈ సంఘటన లో అశోక్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడు తాను ఇష్టంగా కొనుక్కున్న సెల్ ఫోన్ పోయిందని మనస్థాపానికి గురై చెయ్యి కోసుకున్నాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే అశోక్ కుమార్ తల్లి జయమ్మ చేయి కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయిన కుమారుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించింది.
అశోక్ కుమార్ కోలుకోవటంతో ఇంటికి తీసుకు వచ్చిన తల్లి పని మీద బయటకు వెళ్లడంతో మరోమారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు అశోక్.
ఈ సారి ఏకంగా ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం సెల్ ఫోన్ పోయింది అన్న ఒక కారణం తోనే మనస్థాపానికి గురైన అశోక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications