Telangana: బరాత్ లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన యువకుడు..
గుండె పోటు మరణాలు ఆగడం లేదు. వయస్సుతో సంబంధం లేకుండా గుండె పోటు వస్తుంది. ఐదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరు కూడా గుండె పోటుకు అతీతం కాకుండా ఉన్నారు. గతంలో 40 ఏళ్లు పైబడిన వారికే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పడు పరిస్థితి మారిపోయింది. రెండు రోజుల క్రితం కేపీహెచ్బీలో ఉండే ఓ విష్ణువర్ధన్ అనే వ్యక్తి గుడిలో ప్రదక్షిణలు చేస్తూ కుప్పకూలిపోయాడు. విష్ణువర్ధన్ సోమవారం ఉదయం హనుమాన్ దేవాలయానికి ముందుగా ప్రదక్షిణ చేద్దామని చేస్తున్నాడు ఒక చుట్టూ తిరిగి రెండో సారిగేందుకు వెళ్తున్న సమయంలో పిల్లర్ ను పట్టుకున్నాడు.
ఆ తర్వాత కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే విష్ణవర్ధన్ కు సీపీఆర్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అతను గుడిలోనే తుది శ్వాస విడిచాడు.విష్ణువర్ధన్ గుడిలో ప్రదక్షిణలు చేస్తూ పడిపోయిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా 23 ఏళ్ల యువకుడు కూడా గుండె పోటుతో చనిపోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట గ్రామంలో చోటుచేసుకుంది.

కమ్మరిపేట గ్రామానికి చెందిన 23 ఏళ్ల సంజీవ్ అనే యువకుడు చదువుకుంటున్నాడు. మేనమామ కొడుకు పెళ్లికి మోత్కూరావుపేట వెళ్లాడు. పెళ్లి పనులు చేశాడు. అందరితో కలిసి సరదాగా గడిపాడు. నవంబర్ 13న పెళ్లిలో కూడా జాలిగా గడిపాడు. రాత్రి బరాత్ కూడా బాగా డ్యాన్స్ చేశాడు. ఇలా డ్యాన్స్ చేస్తున్న క్రమంలోనే సంజీవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్న వారు వెంటనే అతన్ను లేప ప్రయత్నం చేశారు కానీ అతను లేవలేదు. దీంతో సంజీవ్ ఆస్పత్రికి తరలించారు.
అయితే సంజీవ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతను గుండె పోటు మరణించినట్లు అంచనా వేశాడు. 23 ఏళ్ల యువకుడు కళ్ల ముందే కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. సంజీవ్ మృతితో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె పోటు వస్తుండడంతో చాలా మంది భయపడిపోతున్నారు.












Click it and Unblock the Notifications