అయోధ్య సరయు నదిలో తెలంగాణకు చెందిన యువతి గల్లంతు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యను సందర్శించేందుకు తెలంగాణలోని జనగామ నుంచి ఓ కుటుంబం వెళ్లింది. అయితే, సరయూ నదిలో ఆ కుటుంబానికి చెందిన యువతి గల్లంతయ్యింది. జనగామకు చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట (జులై 28న) ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యకు వెళ్లింది.
రామ మందిరంతో సహా స్థానిక ఆలయాలను సందర్శించారు. సోమవారం ఉదయం 8 గంటలకు నదీ స్మానం చేసేందుకు సరయూ నదిలో లక్ష్మణ్ ఘాట్‌కు వెళ్లారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో పైనుంచి ఒక్కసారిగా వరద నీటిని వదలడంతో ఘాట్‌పైవరకు వరద ఉప్పొంగింది. దీంతో ఒక్కసారిగా ఐదుగురు నీటిలో పడిపోయారు.

అప్రమత్తమైన స్థానికులు వీరిలో నలుగురిని కాపాడారు. అయితే, తేజస్విని అనే యువతి మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇప్పటి వరకూ బాలిక ఆచూకీ దొరకలేదని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లగా.. యూపీ అధికారులతో వారు మాట్లాడారు. నిన్నటి నుంచి యువతి ఆచూకీ కసం రెస్క్యూ బృందాలు గాలిస్తూనే ఉన్నాయి.
యువతి గల్లంతై 24 గంటలు గడిచినా.. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుున్నారు. బాలిక జాడ కోసం లక్ష్మణ్ ఘాట్ వద్దే పడిగాపులు కాస్తున్నారు. తేజస్విని జనగామ పట్టణంలోని ఏబీవీ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది.












Click it and Unblock the Notifications