ఇంత దారుణమా?: డబ్బు తిరిగివ్వమన్నందుకు ఫ్రెండ్ హత్య(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వద్ద తీసుకున్న డబ్బును తిరిగివ్వాలని కోరిన స్నేహితుడినే చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుడు గట్టు సందీప్
ఘటనకు సంబంధించి ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా ములుగుకు చెందిన మిత్రా అనే యువకుడు నగరంలోని యూసుఫ్‌గూడలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన సందీప్‌రెడ్డి అశోక్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరు ఇంజినీరింగ్‌లో స్నేహితులు.

మృతుడు మిత్రా
కాగా, విదేశాలకు వెళ్లేందుకు ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే సంస్థలో మిత్రాతోపాటు రాకేష్ అనే వ్యక్తికి సీటు ఇప్పిస్తానంటూ సందీప్‌రెడ్డి రూ.50 వేలు తీసుకున్నాడు. సీటు ఇప్పంచకపోగా, కొంత కాలంగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడంలేదు. దీంతో నాగోలులో ఉండే స్నేహితుడైన ఉమేష్ ఇంటికి శుక్రవారం మరో స్నేహితుడు పవన్‌తో కలిసి వారు చేరుకున్నారు.

ఆస్పత్రిలో మిత్రా
అక్కడ సందీప్‌రెడ్డిని బాకీ పడ్డ డబ్బుల గురించి వారు నిలదీయడంతో అతడు తన వెంట తెచ్చుకున్న కత్తితో మిత్రాపై దాడి చేశాడు. దీంతో అతడి
గొంతు, మెడభాగంలో తీవ్రగాయాలయ్యాయి.

సందీప్-మిత్రా
రక్తస్రావంతో కప్పకూలిపోయిన అతడ్ని స్నేహితులు కొత్తపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడే మిత్రా మృతి చెందాడు. నిందితుడు సందీప్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications