బాసర ట్రిపుల్ ఐటీలో 600 మంది విద్యార్థులకు అస్వస్థత: దృశ్యాలు హృదయ విదారకం
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ(ఐఐఐటీ)లో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికిపై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఎగ్‌ఫ్రైడ్ రైస్ కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా గుర్తించారు. పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థుల మెస్‌లలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు మెస్ లకు ఒకే చోట భోజనం తయారు చేస్తారు.
Soon after the strong protest IIIT Basara in news again! Mass Food Poisoning at the campus and hundreds of students suffering @sgc_rguktb! Where have ur promises gone @SabithaindraTRS? R u listening @KTRTRS ??#tdpwithIIITBasara#SAVEIIITBASARA#massfoodpoisoning pic.twitter.com/YHVAXU1hz6
— JYOTHSNA TIRUNAGARI (@jyothsna_tdp) July 15, 2022
మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత ఒక్కొక్కరిగా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. క్రమంగా పలువురు స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన అధికారులు క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో నిర్మల్, బైంసా వైద్యులను రప్పించి చికిత్స అందించారు.స్పహ తప్పిపడిపోయిన కొందరు విద్యార్థులను నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ హృదయ విదారకంగా మారింది.

మరోవైపు, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అస్వస్థతపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. కలెక్టర్, బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వెంటనే నివేదిక అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా, బాసర ఐఐఐటీలో విద్యార్థుల అస్వస్థత వార్త విన్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆస్పత్రులకు చేరుకుని వారి పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు తెలిపారు. నిన్నమొన్నటి వరకు ట్రిపుల్ ఐఐఐటీలో కనీస వసతులు కూడా లేవని పది రోజులకుపైగా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications