కొడ్తారా: కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం, లోకేష్‌కు వార్నింగ్
హైదరాబాద్: ఫీజు బకాయిలు చెల్లించాలని అడిగిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయించి, అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విద్యార్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కడియం రాజు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు ఫీజుల విషయంలో తీవ్ర నష్టం జరిగిందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఫీజు బకాయిలు విడుదల చేయకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నాడన్నారు.
ఫీజు బకాయిలు చెల్లించాలని మంత్రులను ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసులతో లాఠీచార్జి చేయించడమే కాకుండా వారిపై అక్రమ కేసులు బనాయించడం శోచనీయమన్నారు. విద్యార్థులకు బకాయి ఉన్న రూ.750 కోట్లను విడుదల చేయాలన్నారు.

'లోకేష్‌కు గుణపాఠం చెబుతారు'
తెలంగాణ మాదిగలను వంచించిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుకు, ఆయన తనయుడు నారా లోకేష్‌కు తెలంగాణలో తిరిగే నైతికత లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో చంద్రబాబును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.
ఆ సందర్భంలో తాను పెద్ద మాదిగనని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నానని, మాదిగల వైపు నిలబడతానని చెప్పడంతో తెలంగాణలో సాగిన ఆయన పాదయాత్రలో తాము పాల్గొన్నామన్నారు. చంద్రబాబాబుకు పడాల్సిన దెబ్బలను మాదిగలు తిన్నారన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టిన తర్వాతే ఆయన కుమారుడు లోకేష్ తెలంగాణలో పాదయాత్రలు చేయాలని, లేని పక్షంలో ఆయన పాదయాత్రను అడుగడుగునా అడ్డుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications