ఏసీబీ వలలో లంచావతారి: డీఈఈ నుంచి రూ. లక్షా32వేలు స్వాధీనం(పిక్చర్స్)
హైదరాబాద్: నల్గొండ జిల్లా గుర్రంపోడు డివిజన్‌లో కొనసాగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం మాణిక్‌ప్రభును అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) నగర విభాగం బుధవారం ఉదయం వలపన్ని పట్టుకుంది.
ఏసిబి డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ పరిధి సైదాబాద్ ఎస్బీహెచ్-ఏ కాలనీ ఉద్యానంలో గుత్తేదారు పి జైపాల్‌రెడ్డి ఇచ్చిన రూ. 1,37,500 లెక్కపెట్టుకొని జేబులో పెట్టుకోగానే నిఘా వేసి పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

ఏసిబి వలలో డీఈఈ
నల్గొండ జిల్లా గుర్రంపోడు డివిజన్‌లో కొనసాగుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం మాణిక్‌ప్రభును అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) నగర విభాగం బుధవారం ఉదయం వలపన్ని పట్టుకుంది.

ఏసిబి వలలో డీఈఈ
ఏసిబి డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ పరిధి సైదాబాద్ ఎస్బీహెచ్-ఏ కాలనీ ఉద్యానంలో గుత్తేదారు పి జైపాల్‌రెడ్డి ఇచ్చిన డబ్బును లెక్కపెట్టుకొని జేబులో పెట్టుకోగానే నిఘా వేసి పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

ఏసిబి వలలో డీఈఈ
సైదాబాద్ సాయిరాంకాలనీకి చెందిన డీఈఈ మాణిక్‌ప్రభుపై గుత్తేదారు జైపాల్‌రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఏసిబి వలలో డీఈఈ
గత జూన్‌లో గుత్తేదారు రూ.32 లక్షల విలువైన పనులు దక్కించుకున్నారు. అందులో 7 శాతం వాటా తనకు ఇవ్వాలని అధికారి చెప్పాడు.

ఏసిబి వలలో డీఈఈ
నిబంధనల మేరకు ఐదు నెలల్లో పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాల్సిందిగా కోరారు. రూ.25 లక్షల మేరకు పనులు పూర్తయినందున 5.5 శాతం వాటా తీసుకురావాల్సిందిగా అధికారి సూచించినట్లు ఫిర్యాదు తెలిపాడు. కాగా, నిందితుణ్ని విచారిస్తున్నామని ఏసిబి అధికారి చెప్పారు.












Click it and Unblock the Notifications